కాబోయే భర్తతో ఆపిల్ బ్యూటీ హన్సిక

Fri Nov 25 2022 14:00:01 GMT+0530 (India Standard Time)

Apple beauty Hansika with her fiance

హిందీ టీవీ సీరియళ్లతో బాలనటిగా ఆరంగేట్రం చేసిన హన్సిక మోత్వానీ ఆ తర్వాత 'దేశముదురు' చిత్రంతో కథానాయికగా టాలీవుడ్ లోకి దూసుకొచ్చిన సంగతి తెలిసిందే. ఆరంగేట్రమే ఆపిల్ బ్యూటీ బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. కానీ ఆ తర్వాత ఎందుకనో మెగా కాంపౌండ్ లో  ఈ బ్యూటీకి సరైన అవకాశాలు రాలేదు. అదే క్రమంలో మంచు కాంపౌండ్ లో వరుస చిత్రాల్లో నటించింది. ఆ తర్వాత హన్సిక కెరీర్ జర్నీ గురించి తెలిసిందే. రామ్ సరసన కందిరీగతో హిట్టు వచ్చినా అదీ ఏమంత కలిసి రాలేదు. తెలుగులో ఆశించిన విజయాల్లేక తమిళంలో ఆఫర్ల కోసం ప్రయత్నించింది. అక్కడ శింబుతో ప్రేమాయణం బ్రేకప్ వగైరా వ్యవహారాలు తెలిసిందే. అదంతా అటుంచితే హిందీలోను హన్సిక కొన్ని సినిమాల్లో నటించినా కానీ స్టార్ డమ్ ని అందుకోలేకపోయింది.గత కొంతకాలంగా హన్సిక పెళ్లి గురించి అభిమానుల్లో ఆసక్తికర ముచ్చట సాగుతోంది. ఈ బ్యూటీ సినీరంగానికి వెలుపల ఇతర నాయికల్లానే ఒక బిజినెస్ మ్యాగ్నెట్ ని పెళ్లాడుతోంది. గత కొంతకాలంగా పెళ్లి ఏర్పాట్లలో తలమునకలుగా ఉంది హన్సిక కుటుంబం. తాజా నివేదికల ప్రకారం హన్సిక -సోహెల్ కొంతకాలంగా మంచి స్నేహితులు. సోహెల్ ముంబైకి చెందిన వ్యాపారవేత్త. ఈ జంట 2022 డిసెంబర్ లో రాజస్థాన్ లో వివాహం చేసుకోనున్నట్లు సమాచారం.

ఇప్పటికే హన్సికతో హబ్బీ ఫోటోలు అంతర్జాలంలో వైరల్ అయ్యాయి. తాజాగా హన్సిక మోత్వాని తన పెళ్లికి ముందు కాబోయే భర్త సోహెల్ కతురియాతో మాతా కీ చౌకీలో అద్భుతంగా కనిపించింది. ముంబైలోని తన మాతా కీ చౌకీలో హన్సిక మోత్వాని ఎరుపు రంగు చీర కాంబినేషన్ బ్లౌజులో అత్యంత అందమైన వధువు మురిపించింది. ఇంతకుముందు హన్సిక తన ఇంటి నుండి ఫంక్షన్ కోసం బయలుదేరినప్పుడు కెమెరాలకు ఫోజులిచ్చింది. ఇప్పుడు ఆ అరుదైన ఫోటోలు ఆన్ లైన్ లో హల్ చల్ చేస్తున్నాయి. దీనికి ముందే హన్సిక మోత్వాని ఈఫిల్ టవర్ వద్ద తన డ్రీమ్ బోయ్ ప్రపోజల్స్ కి సంబంధించిన ఫోటోషూట్ ని కూడా అభిమానులకు షేర్ చేయగా వైరల్ అయ్యాయి.

తాజాగా పెళ్లి వేడుకలో భాగంగా హన్సిక తన కాబోయే భర్త సోహెల్ కతురియా సరసన నిలబడి రొమాంటిక్ గా నవ్వుతూ కనిపించింది.  ఆ ఇద్దరు ఎరుపురంగు దుస్తుల కాంబినేషన్ తో వేదికకు కొత్త గ్లింప్స్ ని తెచ్చారు. వరుడు సోహెల్ కూడా మిర్రర్ వర్క్ ఉన్న ఎర్రటి కుర్తా ధరించి హన్సిక నడుముపై చేయి వేసి లాలనగా తననే చూస్తూ ఫోజిచ్చాడు. మరో ఫోటోలో ఈ జంట ఒక అతిథితో కలిసి కనిపించారు. ప్రస్తుతం ఈ ఫోటోలు అంతర్జాలంలో వైరల్ గా మారాయి.

నవంబర్ ప్రారంభంలోనే హన్సిక పెళ్లి కోసం షాపింగ్ లో బిజీగా ఉంది. తన షాపింగ్ నుంచి కొన్ని ఫోటోలను షేర్ చేసింది. అప్పట్లోనే ఇన్ స్టాగ్రామ్ లో ఒక అందమైన ఫోటోని షేర్ చేసింది. ''నా షాదీ లెహంగా కోసం నిధులు వెతుకుతున్నా''అంటూ హన్సిక దీనికి క్యాప్షన్ ఇచ్చింది. అదే సమయంలో ఈఫిల్ టవర్ ముందు సోహెల్ తనకు ప్రపోజ్ చేస్తున్న ఫోటోలను కూడా ఆమె షేర్ చేసింది. ''నౌ అండ్ ఫరెవర్'' అని హన్సిక పోస్ట్ కి క్యాప్షన్ ఇచ్చింది. సోహైల్ ''ఐ లవ్ యు మై లైఫ్ (రెడ్ హార్ట్ ఎమోజి)'' అని వ్యాఖ్యానించాడు.

హన్సిక తన కెరీర్ ను టీవీ షో దేస్ మే నిక్లా హోగా చంద్‌తో ప్రారంభించింది. తర్వాత షక లక బూమ్ బూమ్- క్యుంకీ సాస్ భీ కభీ బహు థీ -సోన్ పరీలో కనిపించింది. హృతిక్ రోషన్ కోయి... మిల్ గయాలో కూడా బాలనటిగా నటించింది. ముంబైలో జన్మించిన ఈ ట్యాలెంటెడ్ బ్యూటీ తర్వాత దక్షిణ చిత్ర పరిశ్రమలో తెలుగు-తమిళం లో నటించింది. ఆమె చివరిగా విడుదలైన తమిళ క్రైమ్ థ్రిల్లర్ మహా.నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.