ప్రభాస్ కాకుండా మరెవ్వరైనా ఏడాది గ్యాప్ తీసుకునేవారు

Sun Jul 18 2021 13:00:00 GMT+0530 (IST)

Anyone other than Prabhas would take the year gap

టాలీవుడ్ తో పాటు బాలీవుడ్ ఇతర భాషల్లో ఏ హీరోను తీసుకున్నా కూడా చిన్న చిన్న యాక్సిడెంట్స్ కు షూటింగ్ లో ప్రమాదాలకు నెలలకు నెలలు గ్యాప్ తీసుకున్న సందర్బాలు ఉన్నాయి. కాని ప్రభాస్ మాత్రం ప్రమాదం ఎలాంటిది అయినా.. గాయం ఎంతది అయినా కూడా కొద్ది గ్యాప్ తీసుకుని వెంటనే వర్క్ లోకి దిగి పోతాడు. అది బాహుబలి సమయం నుండి కూడా ప్రభాస్ ను క్లోజ్ గా పరిశీలిస్తున్న వారికి తెలుసు. బాహుబలి సమయంలో ఎన్నో సార్లు చిన్న చిన్న గాయాల పాలయ్యాడు ప్రభాస్. ఆ సమయంలో ఆయన గురించి రక రకాలుగా పుకార్లు షికార్లు చేశాయి. హీరోగా బాహుబలి కోసం ఏకంగా అయిదు సంవత్సరాలు కేటాయించాడు అంటే ప్రభాస్ కు ఉన్న ఓపిక మరియు ఆయన పట్టుదలను అర్థం చేసుకోవచ్చు. అంతగా ఓపిక పట్టుదల ఉంది కనుకే ప్రభాస్ ఇప్పుడు ఆల్ ఇండియా సూపర్ స్టార్ గా నిలిచాడు అనడంలో సందేహం లేదు.బాహుబలి తర్వాత వరుసగా సినిమాలు చేస్తూనే ఉన్నాడు. సాహో సమయంలోనే మొదలు పెట్టిన రాధే శ్యామ్ కోసం చాలా రోజుల డేట్లు కేటాయించాడు. కరోనా కారణంగా ఆయన సినిమాల విడుదల ఆగిపోయాయి. లేదంటే ఇప్పటికే రాధే శ్యామ్ షూటింగ్ పూర్తి అయ్యి విడుదల అయ్యేది. మరో వైపు సలార్ కూడా షూటింగ్ చక చక జరుపుతూ వచ్చే ఏడాది ఆరంభంలో విడుదల చేసేవారు. అలా బ్యాక్ టు బ్యాక్ ప్రభాస్ సినిమాలు ఇండియన్ సినీ అభిమానుల ముందుకు వచ్చేవి. ప్రస్తుతం ప్రభాస్ మూడు సినిమాల షూటింగ్ ల్లో గ్యాప్ లేకుండా పాల్గొంటున్నాడు. కొన్ని వారాల క్రితం ప్రభాస్ కు కాలు కు కాస్త పెద్ద గాయమే అయ్యిందట. అయినా కూడా ఏమాత్రం మేకర్స్ ను ఇబ్బంది పెట్టకుండా సినిమా షూటింగ్ లకు ప్రభాస్ హాజరు అవుతున్నాడు. ప్రభాస్ కు అయినటువంటి గాయం కనుక మరో హీరోకు అయినా కూడా కనీసం ఏడాది పాటు షూటింగ్ లకు బ్రేక్ ఇచ్చి విశ్రాంతి తీసుకునే వారు అని.. కాని ప్రభాస్ మాత్రం కొన్ని వారాలు బ్రేక్ తీసుకుని మళ్లీ షూటింగ్ కు జాయిన్ అయ్యాడు అంటున్నారు.

ప్రభాస్ గాయం అయినా కూడా షూటింగ్ లో పాల్గొన్న సందర్బాలు చాలానే ఉన్నాయి. నిర్మాతల యొక్క ఆర్థిక భారం తో పాటు ఇతర విషయాల గురించి ఎక్కువగా ఆలోచించడం వల్లే ప్రభాస్ గాయాలతో కూడా షూటింగ్ లో పాల్గొన్నాడు అంటున్నారు. ఇక ప్రభాస్ సినిమా ల విషయానికి వస్తే రాధే శ్యామ్ షూటింగ్ ముగింపు దశకు వచ్చింది. ఇదే ఏడాదిలో సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఇక సలార్ ను ఈ ఏడాది చివరి వరకు ముగించి సంక్రాంతికి విడుదల చేస్తామని అంటున్నారు. ప్రభాస్ మొదటి బాలీవుడ్ మూవీ ఆది పురుష్ కూడా షూటింగ్ ను ఇదే ఏడాదిలో ముగిస్తారనే టాక్ వినిపిస్తుంది.

విజువల్ వండర్ గా రూపొందబోతున్న ఈ సినిమా ను వచ్చే ఏడాది ఆగస్టులో విడుదల చేస్తామని చెబుతున్నారు. ఇక మహానటి దర్శకుడు తో కూడా ప్రభాస్ సినిమా ఉంది. అది హాలీవుడ్ రేంజ్ లో ఉంటుందట. ఇంటర్నేషనల్ స్టార్ గా ప్రభాస్ ను ఆ సినిమా నిలుపుతుందని యూనిట్ సభ్యులు చెబుతున్నారు. మొత్తానికి ప్రభాస్ సినిమా సినిమాకు తన స్టార్ డం ను పెంచుకుంటూ పోతున్నాడు. అంతే తప్ప చిన్న చిన్న కారణాలు చెప్పి షూటింగ్ లకు మాత్రం బ్రేక్ ఇవ్వడం లేదు.