Begin typing your search above and press return to search.

అమ్మడు అందాలతోనే కాదు.. నవ్వుతో కూడా ఫిదా చేస్తుంది!

By:  Tupaki Desk   |   6 Jun 2020 11:10 AM GMT
అమ్మడు అందాలతోనే కాదు.. నవ్వుతో కూడా ఫిదా చేస్తుంది!
X
బాలీవుడ్ అందాల నటి అనుష్క శర్మ గురించి తెలియనివారు ఉండరు. ఎందుకంటే ఆమె హీరోయిన్ గా తెలియని వారికి క్రికెటర్ విరాట్ కోహ్లీ భార్యగా గుర్తుంటుంది. మోడల్ నుండి హీరోయిన్ గా మారిన అనుష్క ప్రయాణం ఎంతోమందికి ఇన్స్పిరేషన్ గా నిలుస్తుంది. అయితే మోడల్ గా ఉన్నప్పుడు మ్యాగజైన్స్ కోసం ఎన్ని అందాలు ఆరబోసిందో సినిమాల్లోకి వచ్చాక అమ్మడు అంతకుమించి అందాల ప్రదర్శన చేసిందని చెప్పాలి. అనుష్క చీరకట్టు నుండి బికినీ వరకు ఆమెను ఆరాధ్య దేవతగా కొలిచే అభిమానులు కోట్లలో ఉన్నారు. అయితే విరాట్ తో పెళ్లి అయిన తర్వాత ఈ భామ కాస్త అందాల ప్రదర్శన తగ్గించిందని చెప్పాలి. కాకపోతే సినిమా ఫీల్డ్ మాత్రం వదలలేదు. ఎందుకంటే ఆ సినిమా ఇండస్ట్రీనే ఆమె ప్యాషన్ అంటోంది. హీరోయిన్ గా ఎదిగిన తర్వాత అమ్మడు కాస్త సినీ నిర్మాణం వైపు అడుగులు వేసింది. అందులో కూడా సక్సెస్ అందుకుంది.

ఇండస్ట్రీలోకి రావడంతోనే బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ సరసన 'రబ్ నే బనాది జోడి' సినిమాలో మెప్పించింది. ఆ తర్వాత రన్వీర్ సింగ్, సల్మాన్ ఖాన్, రణబీర్ కపూర్, అమిర్ ఖాన్.. ఇలా స్టార్ హీరోల అందరితో అనుష్క నటించింది. ఇక ప్రస్తుతం లాక్ డౌన్ వలన ఇంట్లోనే ఉంటున్న అనుష్క.. రీసెంట్ గా 'పాతాళలోక్' అనే వెబ్ సిరీస్ నిర్మించి హిట్ అందుకుంది. కొంతకాలంగా అనుష్క తెరమీద తక్కువగా కనిపిస్తుంది. అందుకు ఆమె అభిమానులు చాలా ఫీల్ అవుతున్నారు. ఎందుకంటే అనుష్క బ్యూటీని చూసి చాలాకాలం అయిందని.. అయితే అనుష్క ఇంట్లో ఉన్నా సోషల్ మీడియాలో మాత్రం ఎల్లప్పుడూ అందుబాటులోనే ఉంటుంది. ఎప్పటికప్పుడు తన ఫోటోలను పోస్ట్ చేసి అభిమానులను అలరిస్తుంది. ఇక తాజాగా ఈ ముద్దుగుమ్మ ఇంస్టాగ్రామ్ లో తన ఫోటో పోస్ట్ చేసింది. ఇక అభిమానులు ఊరుకుంటారా.. వెంటనే లైక్స్ షేర్స్ కొట్టి వైరల్ చేస్తున్నారు. ఆ ఫోటోలో అమ్మడు జిమ్ డ్రెస్ ధరించి ఫోన్ పక్కన పెట్టేసి నవ్వుతూ ఉంది. మరి ఫేవరెట్ హీరోయిన్ నవ్వితే ఎవరైనా ఫిదా అయిపోరా.. అమ్మడి అందాలకే కాదు నవ్వుకి కూడా ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు.