Begin typing your search above and press return to search.

అనుష్క స‌మ‌స్య బ‌రువుతోనా.. పెళ్లితోనా?

By:  Tupaki Desk   |   27 Oct 2021 6:34 AM GMT
అనుష్క స‌మ‌స్య బ‌రువుతోనా.. పెళ్లితోనా?
X
స్వీటీ శెట్టి అలియాస్ అనుష్క శెట్టి ఇటీవ‌ల కొంత‌కాలంగా న‌ట‌న‌కు దూర‌మైన సంగ‌తి తెలిసిందే. నిశ్శ‌బ్ధం త‌ర్వాత వేరొక సినిమాని ప్ర‌క‌టించ‌లేదు. అదే క్ర‌మంలో గ‌త కొద్దికాలంగా అనుష్కపై ర‌క‌ర‌కాల రూమ‌ర్లు పుట్టుకొచ్చాయి. స్వీటీ ఇంకా అధిక బ‌రువు స‌మ‌స్య‌ల నుంచి బ‌య‌ట‌ప‌డ‌లేక‌పోతోంద‌ని అలాగే వ‌య‌సు 35బార్డ‌ర్ క్రాస్ చేయ‌డంతో ఇక ఇంట్లో వాళ్లు పెళ్లి చేసేయాల‌ని భావిస్తున్నార‌ని కూడా క‌థనాలొచ్చాయి.

ఏదేమైనా న‌ట‌నకు ఇప్పుడు అనుష్క‌ పూర్తిగా దూరంగా ఉంది. నిజానికి బాహుబ‌లి స్టార్ గా అనుష్క శెట్టి వ‌రుస పాన్ ఇండియా చిత్రాల‌తో బిజీ అవుతుంద‌ని అటుపై హిందీ ప‌రిశ్ర‌మ‌కు వెళుతుంద‌ని కూడా అభిమానులు భావించారు. కానీ అవేవీ నిజాలు కాలేదు. అప్ప‌టికి సైజ్ జీరో కోసం పెరిగిన‌ అధిక బ‌రువు నుంచి బ‌య‌ట‌ప‌డేందుకు ర‌క‌ర‌కాల నేచుర‌ల్ చికిత్సావిధానాల‌ను అనుస‌రిస్తోంద‌ని కూడా క‌థ‌నాలు వైర‌ల్ అయ్యాయి. ఆ క్ర‌మంలోనే వేరే సినిమాల‌కు అనుష్క శెట్టి సంత‌కాలు చేయ‌లేదు. ఇటీవ‌లే స్వీటీ మారిన రూపం అంటూ స్లిమ్ లుక్ తో ఉన్న ఫోటోలు వైర‌ల్ కాగా అభిమానుల నుంచి వాటికి అద్భుత స్పంద‌న వ‌చ్చింది.

అయితే బ‌రువు అప్ప‌టికి పూర్తిగా త‌గ్గిపోలేదు. తాజా స‌మాచారం మేర‌కు అనుష్క బరువు తగ్గినట్లు సమాచారం. ఆమె మునుపటి కంటే ఫిట్ గా కనిపిస్తోంది. అలాగ‌ని ఇప్ప‌టికిప్పుడు సన్నగా తయారైందని అర్థం కాదు. స్లిమ్ లుక్ ని సాధించ‌డానికి ఇంకా చాలా స‌మ‌యం ప‌డుతుంద‌ట‌. కాక‌పోతే మునుప‌టితో పోలిస్తే త‌న రూపం మెరుగ్గా కనిపిస్తోందట‌. ఒక‌వేళ ఇదే నిజమైతే.. న‌ట‌న‌ను పూర్తిగా విస్మ‌రించ‌కుండా ఏదైనా సినిమాకి సంత‌కం చేయాల‌ని త‌న అభిమానులు కోరుకుంటున్నారు. మ‌రి అనుష్క మైండ్ లో ఏం ఉంది? అన్న‌ది తెలియాల్సి ఉంది. ఈ లాక్ డౌన్ స‌మ‌యంలో అనుష్క న‌టించే సినిమాల ప్ర‌క‌ట‌న ఉంటుంద‌ని ప్ర‌చార‌మైనా ఎలాంటి ప్ర‌క‌ట‌నా లేదు. క‌రోనా క్రైసిస్ లో త‌న కుటుంబ స‌భ్యుల‌తోనే అనుష్క ఉన్నారు. భాగ‌మ‌తి త‌ర్వాత యువి క్రియేష‌న్స్ లో క‌మిట్ మెంట్ ని అనుష్క పూర్తి చేయాల్సి ఉంటుందని స‌మాచారం.