విరుష్క జంటపై అలాంటి కుట్ర నిజమా?

Fri Mar 24 2023 08:00:01 GMT+0530 (India Standard Time)

Anushka Sharma and Virat Kohli make striking appearance in gorgeous outfits

బాలీవుడ్ నటి- నిర్మాత అనుష్క శర్మ - టీమిండియా ప్లేయర్ విరాట్ కోహ్లీ పెళ్లి వారసురాలి రాక అంతా వేగంగానే... ఈ జంట అన్యోన్యత ప్రేమానుబంధాలు అభిమానుల్లో స్ఫూర్తిని నింపుతాయి. హిందీ క్రౌడ్స్ లో ఈ జంట ఆదర్శజంటగా వెలిగిపోతోంది. చాలా సందర్భాల్లో కలిసి జంటగా షికార్లు చేస్తూ అభిమానులకు కనిపించారు. తమ వారసురాలు వామిక ఫోటోలను ఇటీవల బహిర్గతం చేయగా అవి అభిమానుల్లో వైరల్ అయ్యాయి. లేటెస్టుగా మరోసారి ఈ అందమైన జంట కలిసి బహిరంగంగా కనిపించారు. భార్యాభర్తలు గురువారం ముంబైలో జరిగిన ఇండియన్ స్పోర్ట్స్ ఆనర్స్ 2023 కార్యక్రమానికి హాజరయ్యారు.ఈ ఈవెంట్ లో రెడ్ కార్పెట్ పై అనుష్క - విరాట్ స్టిల్ ఫోటోగ్రాఫర్లకు పోజులిచ్చిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈవెంట్ కోసం విరాట్ పర్ఫెక్ట్ జెంటిల్ మన్ లుక్ తో హాజరవ్వగా.. అనుష్క పర్పుల్ ఆఫ్ షోల్డర్ దుస్తుల్లో చిరునవ్వులు చిందిస్తూ అందంగా కనిపించింది. ఈ ఈవెంట్ కు సిద్ధమయ్యే క్రమంలో అనుష్క విరాట్ తో కలిసి ఉన్న అరుదైన ఫోటోలను కూడా షేర్ చేసింది.

ఈవెంట్ నుండి జంట వీడియోని ముంబై స్టిల్ ఫోటోగ్రాఫర్ ఒకరు ఇన్ స్టాలో షేర్ చేయగా అది వైరల్ గా మారింది. విరాట్ ని ఫోటోగ్రాఫర్ లు రకరకాల కోణాల్లో ఫోటోలకు ఫోజులివ్వాల్సిందిగా కోరగా.. అనుష్క శర్మ నవ్వులు చిందించింది. ఆదర్శజంటను ఇలా కలిసి చూడడం పై అభిమానులు ఆనందం వ్యక్తం చేశారు.

వారిలో ఒకరు వీడియోపై వ్యాఖ్యానిస్తూ -``ఓహో.. అనుష్క లుక్ అద్భుతంగా ఉంది… `` అని అన్నారు. “అనుష్కా!! ఎంత అందంగా ఉంది అని ఒకరు వ్యాఖ్యానించారు. అనుష్క - విరాట్ ఉత్తమ జోడీ అని కూడా రాసారు. ఎట్టకేలకు ఈ జంట ఫోటోలు లభించాయి! అని వేరొకరు రిప్లయ్ ఇచ్చారు. టీమిండియా కెప్టెన్ గా అసాధారణ రికార్డులను సొంతం చేసుకున్న కోహ్లీ తన భార్య అనుష్క వారసురాలితో కలిసి అధిక సమయం కేటాయించేందుకు ఆసక్తిగా ఉంటారు.నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.