ఫొటోటాక్ : బేబీ బంప్ తో స్వమ్మింగ్ పూల్ లో స్టార్ హీరోయిన్

Mon Sep 21 2020 23:03:35 GMT+0530 (IST)

PhotoTalk: Star heroine in swimming pool with baby bump

స్టార్ కపుల్ కోహ్లీ అనుష్కలు తల్లిదండ్రులు కాబోతున్న విషయం తెల్సిందే. కొన్ని వారాల క్రితం కోహ్లీ ఫొటో షేర్ చేసి తాము తల్లిదండ్రులం కాబోతున్నట్లుగా అధికారికంగా ప్రకటించాడు. అప్పటి నుండి అనుష్క గురించి సోషల్ మీడియాలో తెగ సెర్చ్ చేస్తున్నారు. కోహ్లీ ఐపీఎల్ ఆడేందుకు యూఏఈ వెళ్లాడు. మరి అనుష్క కూడా వెళ్లిందా అంటూ చాలా మంది గూగుల్ లో చూస్తున్నారు. ఇదే సమయంలో ఆమె సోషల్ మీడియా అకౌంట్ ను భారీగా ఫాలోవర్స్ ఫాలో అవుతున్నారు. 43 మిలియన్ ల ఫాలోవర్స్ ఉన్న తన ఇన్ స్టా లో రెగ్యులర్ గా అనుష్క పోస్ట్ లు పెడుతూనే వస్తోంది. తాజాగా మరో పోస్ట్ ను షేర్ చేసింది.ఈసారి బ్లాక్ స్విమ్ సూట్ లో స్విమ్మింగ్ పూల్ లో అనుష్క ఉంది. అనుష్క రెగ్యులర్ గా కంటే కాస్త బరువు పెరిగినట్లుగా ఈ ఫొటోలో చూస్తుంటే అనిపిస్తుంది. గర్బవతి అయినప్పుడు బరువు పెగరడం అనేది కామన్ గా చూస్తూనే ఉంటాం. అనుష్క కూడా బరువు పెరిగింది. ఇక ఎక్సర్ సైజ్ లు మరియు గర్బవతులు చేయాల్సిన వర్కౌట్స్ రెగ్యులర్ గా చేస్తూ గర్బంలో ఉన్న పిండంను చాలా జాగ్రతగా చూసుకుంటుంది. అనుష్క మరో మూడు నాలుగు నెలల్లో కోహ్లీ చేతిలో పండంటి బాబు లేదా పాపను పెట్టబోతుంది. ఆ సన్నివేశం కోసం ప్రపంచ వ్యాప్తంగా ఉన్న కోహ్లీ అభిమానులు ఎదురు చూస్తున్నారు.