Begin typing your search above and press return to search.

ఆ బ్యూటీ కాళ్లు.. చేతులు ఒకే ఆకారంలో!

By:  Tupaki Desk   |   19 Aug 2022 2:30 PM GMT
ఆ బ్యూటీ కాళ్లు.. చేతులు ఒకే ఆకారంలో!
X
బాలీవుడ్ నటి అనుష్క సోషల్ మీడియా యాక్టివిటీ గురించి చెప్పాల్సిన పనిలేదు. ఎప్పటికప్పుడు కొత్త ఫోటోలతో యువతని ఆకట్టుకుంటుంది. అవసరం మేర అంతే అందంగానూ అందాలు ఆరబోస్తుంది. అయితే విరాట్ ని పెళ్లాడిన త‌ర్వాత చాలా సెల‌క్టివ్ గా ఉంటుంది. గ్లామ‌ర్ పాత్ర‌ల‌కు దూరంగా ఉంటూ..కంటెంట్ ప్ర‌ధానంగా ఉండే సినిమాలు చేస్తుంది.

ఆఫ్ స్ర్కీన్ ఫోటో సెష‌న్ లోనూ అంతే సెల‌క్టివ్ గా ఉంటుంది. ఇన్ స్టాలో కి కూల్ ఫోటోస్..ట్రెడీష‌న‌ల్ ఫోటోల్ని ఎక్కువ‌గా వ‌దులుతుంది. తాజాగా అమ్మడి కొత్త ఫోటో ఒకటి నెట్టింట వైర‌ల్ అవుతుంది. పార్క్ లో పీస్ ఆఫ్ మైండ్ తో ఇలా కూర్చుని కెమెరాకి ఫోజులిచ్చింది. ఎలాంటి డిస్ట‌బెన్స్ లేని చుట్టూ ప్ర‌శాంత‌మైన వాతావ‌ర‌ణం..చెట్టు కింది బ‌ల్ల‌పై ఇలా కూర్చుని కూల్ గా క్యామ్ ని ఆక‌ర్షించింది.

షోల్డ‌ర్స్ మొత్తం క‌ప్పేసి వైట్ క‌ల‌ర్ క్యాజువ‌ల్ డిజైన‌ర్ లో త‌ళుక్కున మెరిసింది. ఎండ తీవ్ర‌త‌ని త‌ట్టుకునేలా క‌ళ్ల‌కి కూలింగ్ గ్లాసెస్ తో వైడ్ యాంగిల్ లో ఫోజులిచ్చింది. చేతికి టైటాన్ వాచ్.. కాళ్ల‌కి హై హిల్స్ అమ్మ‌డిని మ‌రింత అందంగా మలిచాయి.

ఇక ఫోటోలో హైలైట్ అంశం ఏంటంటే? అమ్మ‌డి చేతులు..కాళ్లు ఒకేలా క‌నిపించ‌డం. ఆ రెండింటి మ‌ధ్య పెద్ద‌గా తేడా తెలియ‌డం లేదు. స‌న్న‌ని ప‌త్తి క‌ర్ర‌ల్లా ఒకే ర‌క‌మైన ఆకారాన్ని క‌ల్గి ఉన్నాయి. ప్రస్తుతం ఈ ఫోటో నెట్టింట వైర‌ల్ గా మారింది.

అనుష్క కెరీర్ మ్యాటర్ కి వస్తే.. అనుష్క తదుపరి నటిగా బిజీ కానుంది. క్లీన్ స్లేట్ ప్రొడక్షన్స్ నుండి వైదొలిగి వేరొకరికి బాధ్యతలు అప్పగించి నటనలోకి వచ్చేసింది. ఆమె ప్రస్తుతం 'చక్ దే ఎక్స్ప్రెస్' షూటింగ్ లో ఉంది. ఇది జులన్ గోస్వామి ప్రయాణం నుండి ప్రేరణ పొందిన కథతో రూపందుతోంది.

ఈ చిత్రం నెట్ ఫ్లిక్స్ లో విడుదల కానుంది. అలాగే సొంత ప్రొడక్షన్ హౌస్ లో సినిమాల జోరు పెంచినట్లు కనినిపిస్తుంది. ఇటీవలే ఓ కార్పోరేట్ ఓటీటీతో టైఅప్ అవ్వడంతో క్వాలిటీ కంటెంట్ ని అందించాలని టార్గెట్ గా పని చేస్తుంది. మరోవైపు మంచి భార్యగా...ఓ బిడ్డకి తల్లిగానూ బాధ్యతలు నెరవేరుస్తుంది.