Begin typing your search above and press return to search.

ఒంపుసొంపులు పోతే.. ఛాన్సులు పోతాయ్‌

By:  Tupaki Desk   |   3 Dec 2015 7:30 PM GMT
ఒంపుసొంపులు పోతే.. ఛాన్సులు పోతాయ్‌
X
ఈ విషయం గురించి ఏ హీరోయిన్‌ ను అడిగినా చెబుతోంది. అయితే మన టాలీవుడ్‌ లో అంతగా ఏమీ ఉండదులే. చాలామంది హీరోయిన్లు వచ్చిన కొత్తల్లో సన్నగా ఆ తరువాత కాస్త బొద్దుగా మారినవారే. మరీ బొద్దెక్కేసిన నమిత, ఆర్తి అగర్వాల్‌ విషయంలో వేరు కాని.. అదర్వయిజ్‌ కాస్త బొద్దెక్కితే మాత్రం పెద్దగా వచ్చే నష్టం ఏమీ ఉండదు.

ఇప్పుడున్న హీరోయిన్లలో సమంత - కాజల్‌ - త్రిష వచ్చిన కొత్తల్లో ఇంకా సన్నగా ఉండేవారు. వారు ఎలా ఉన్నా కూడా అవకాశాల జోరు అయితే అలాగే ఉంది. కాని బాలీవుడ్‌ లో అయితే అలా కాదు. సినిమాల్లోకి వచ్చినప్పుడు కనుక తమ కొలతలు ఇంత అని ప్రకటించారనుకోండి.. తరువాత కూడా అదే మెయిన్టయిన్‌ చేయాలి. 32-28-32 అంటే.. అంతే ఉండాలి. లేకపోతే ఛాన్సులు ఫట్టే. ఒంపుసొంపులు మిస్సయ్యాయో.. అంతే సంగతులు. అవునోకాదో తెలియాలంటే ఓ మారు అనుష్క శర్మను అడగండి.

''నేను సినిమాల్లోకి వచ్చినప్పుడు ఏవైతే కొలతల్లో ఉన్నానో.. ఇప్పుడు కూడా సేమ్‌ టు సేమ్‌ అవే. ఆ కొలతలు మారితే మాత్రం కాంట్రాక్టులు చేజారిపోతాయ్‌. చాలామంది హీరోయిన్ల విషయంలో అదే జరిగింది. బాలీవుడ్‌ బాగా సెక్సిష్టు ఇండస్ర్టీ. అమ్మాయిలకు కొలతలే ముఖ్యం. అదే హీరోలైతే ఎలాగైనా బలవొచ్చు'' అంటూ చెప్పుకొచ్చింది అమ్మడు.

కేవలం గ్లామర్‌ నే నమ్ముకున్న హీరోయిన్లకైతే కొలతలే ముఖ్యంలే. ఎందుకంటే.. బొద్దెక్కినా కూడా విద్యా బాలన్‌ - ఐశ్వర్య రాయ్‌ - రాణి ముఖర్జీ లు సినిమాలు చేయట్లేదేంటి.