సర్కారు వారి పాట : కీర్తి సురేష్ తో పాటు అనుష్క కూడా

Sat Nov 21 2020 18:40:38 GMT+0530 (IST)

Sarkaru Vaari Paata: Anushka along with Kirti Suresh

సూపర్ స్టార్ మహేష్ బాబు.. పరశురామ్ ల కాంబినేషన్ లో రూపొందబోతున్న సర్కారు వారి పాట సినిమాకు సంబంధించిన చిత్రీకరణ ఏర్పాట్లు జరుగుతున్నాయి. మొదటి షెడ్యూల్ ను అమెరికాలో ప్లాన్ చేయగా కరోనా కారణంగా ఆలస్యం అవుతుంది. వచ్చే నెల కాకున్నా జనవరిలో అయినా సర్కారు వారి పాట చిత్రీకరణ మొదలు కాబోతుంది. ఇప్పటికే ఈ సినిమాలో హీరోయిన్ గా కీర్తి సురేష్ నటించబోతుంది అంటూ అధికారికంగా ప్రకటించారు. ఇటీవల ఆమె బర్త్ డే సందర్బంగా ఆమె నటించే విషయమై అధికారికంగా స్పష్టతను ఇచ్చారు.సర్కారు వారి పాట సినిమాలో మరో హీరోయిన్ కూడా కనిపించబోతుందట. అయితే హీరోయిన్ గా కాకుండా కీలక పాత్రలో ఆ హీరోయిన్ కనిపించనున్నట్లుగా తెలుస్తోంది. ఆ హీరోయిన్ మరెవ్వరో కాదు అనుష్క అంటూ ప్రచారం జరుగుతోంది.. మహేష్ బాబుతో గతంలో ఖలేజా సినిమాలో నటించిన అనుష్క మళ్లీ ఇన్నాళ్ల తర్వాత సర్కారు వారి పాట సినిమాలో కీలక పాత్రలో నటించేందుకు ఒప్పుకుందని మీడియా వర్గాల్లో పుకార్లు షికార్లు చేస్తున్నాయి. ఈ పుకార్లు నమ్మశక్యంగా లేవు.. కాని నిజం అయితే మాత్రం సర్కారు వారి పాట స్థాయి రెట్టింపు అవ్వడం ఖాయం అంటూ ప్రేక్షకులు మరియు సినీ వర్గాల వారు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. దర్శకుడు పరశురామ్ ఈ విషయంలో స్పష్టత ఇస్తాడని మహేష అభిమానులు వెయిట్ చేస్తున్నారు.