తాను డిప్రెషన్ కు గురయ్యా.. టాలెంటెడ్ ఫిల్మ్ మేకర్ కామెంట్స్ వైరల్

Mon Nov 28 2022 15:00:37 GMT+0530 (India Standard Time)

Anurag Kashyap About His Depression

అనురాగ్ కశ్యప్.. బాలీవుడ్ లో టాలెంటెడ్ దర్శకుడిగా.. నటుడిగా మల్టీ టాలెంటెడ్ గా పేరు తెచ్చుకున్నారు.  'గ్యాంగ్స్ ఆఫ్ వాస్సేపూర్' బాంబే వెల్వెట్ లాంటి చాలా ప్రసిద్ధ నెట్ఫ్లిక్స్ సిరీస్ లస్ట్ స్టోరీస్ వంటి చిత్రాలతో అందరికీ సుపరిచితుడు. అయితే ఈ దర్శకుడు ఇటీవల తాప్సీ నటించిన దోబారాతో మరోసారి బాలీవుడ్ లో మన ముందుకు వచ్చాడు. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద విజయం సాధించలేదు.ఇటీవలి ఇంటర్వ్యూలో ఎన్నో  అవార్డులు గెలుచుకున్న దర్శకుడు అనురాగ్ చేసిన కామెంట్స్ చర్చనీయాంశమయ్యారు. 'తాను డిప్రెషన్లో ఉన్నానని.. దాని నుండి బయటపడటానికి పునరావాస కేంద్రానికి వెళ్లవలసి ఉందని' పేర్కొన్నాడు.

ఇదే విషయాన్ని వివరిస్తూ తాను 2019లో పౌరసత్వ సవరణ చట్టం (CAA)కి వ్యతిరేకంగా మాట్లాడానని దాని కారణంగా తన కుమార్తెపై అత్యాచారం బెదిరింపులు రావడం ప్రారంభించాయని కశ్యప్ వెల్లడించారు.

చాలా మానసిక క్షోభ  తర్వాత తన ట్విట్టర్ ఖాతాను డిలీట్ చేశానని అది కూడా గత ఏడాది తనకు గుండెపోటుకు కారణమైందని చెప్పాడు. అంతేకాకుండా ఆ బెదిరింపుల కారణంగా తన కుమార్తె అలియా కస్యాగ్ ఆందోళనకు గురయ్యారని ఆయన వెల్లడించారు.

కుటుంబంతో కలిసి పోర్చుగల్ వెళ్లిపోయానని.. కొన్ని రోజుల తర్వాత సినిమా షూటింగ్ కోసం భారత్ కు వచ్చానని తెలిపారు. నేను తీసే చిత్రాలు ఆలస్యమై వెబ్ సిరీస్ లు ఆగిపోయి నాపై ఒత్తిడి అంతా పడి ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపిందని తెలిపారు. వీటన్నింటిని ఎదుర్కొని ప్రస్తుతం పనిలో బిజీగా ఉన్నానని అనురాగ్ తెలిపాడు.

ప్రస్తుతం అనురాగ్ దర్శకత్వంలో 'మొహబ్బత్' సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది. మరికొన్ని వెబ్ సిరీస్ లను ఆయన రూపొందిస్తున్నారు. అనురాగ్ ఎదుర్కొన్న దారుణమైన సంఘటన గురించి వివరించడంతో ఇవి ఇండస్ట్రీలో చర్చనీయాంశమయ్యాయి.నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.