అర్థరాత్రి స్వాతంత్య్రం గుట్టు విప్పుతుందా?

Sat Nov 21 2020 13:20:55 GMT+0530 (IST)

Will independence unfold in the middle of the night?

టాలీవుడ్ లో అంతగా వెలగలేక చతికిలబడిన భామగా అనుపమ పరమేశ్వరన్ పేరు వినబడుతోంది. తన కంటే లేట్ గా వచ్చినా లేటెస్టుగా దూసుకుపోతున్న మల్లూ భామలెందరో. ప్రేమమ్ కోస్టార్ సాయి పల్లవి.. లేటెస్ట్ బ్యూటీ మాళవిక మోహనన్.. నివేధ థామస్ వంటి భామలు కెరీర్ పరంగా సర్రున దూసుకుపోతుంటే అనుపమ మాత్రం చాలా వెనకబడింది.ఆచితూచి ఎంపికలు పట్టు విడుపు లేకపోవడంతోనే ఇలా ఎన్నో ఆఫర్లు వదులుకోవాల్సి వస్తోందన్న కామెంట్లు ఉన్నాయి. అప్పట్లో రాక్షసుడు సినిమాతో బ్లాక్ బస్టర్ కొట్టినా రామ్ తో చేసిన రెండు సినిమాలు ఫ్లాపులవ్వడం ఇబ్బందికరంగా మారింది. ప్రస్తుతం అనుపమ మలయాళంలో వరసగా సినిమాలు చేస్తోంది. నిఖిల్ సరసనా ఓ తెలుగు సినిమాకి కమిటైందని వార్తలొచ్చాయి.

వీటన్నిటికీ మించి అనుపమ చేస్తున్న లేటెస్ట్ మలయాళ మూవీ ఫ్రీడమ్ ఎట్ మిడ్ నైట్ పై యూత్ లో ఆసక్తికర చర్చ సాగుతోంది. తాజాగా ఈ మూవీ నుంచి అనుపమ ఫస్ట్ లుక్ ని ఆవిష్కరించగా యువతరంలోకి దూసుకెళ్లింది. షార్ట్ ఫిక్షన్ మూవీగా చెబుతున్న దీనిలో అనుపమ పరమేశ్వరన్ ప్రధాన పాత్రలో నటించనుంది. ఆర్జే షాన్ తెరకెక్కిస్తున్నారు. అనుపమ ఇటీవల `మణిరైలే అశోకన్` అనే చిత్రంలోనూ కనిపించింది. ఇందులో గ్రెగొరీ ప్రధాన పాత్రలో నటించారు. ఫ్రీడమ్ ఎట్ మిడ్ నైట్ పోస్టర్ లో అనుపమ క్యూట్ లుక్ మరోసారి యూత్ లో హాట్ టాపిక్ గా మారింది.