అనూలో చిలిపితనం టీజింగ్ ఎక్కువైందిగా

Wed Apr 21 2021 15:00:01 GMT+0530 (IST)

Anu pranks teasing more and more

అందం ప్రతిభ ఉండీ ఆశించిన రేంజుకు ఎదగలేకపోయింది అను ఇమ్మాన్యుయేల్. ఈ అమ్మడికి లక్ ఏ విధంగానూ ఫేవర్ చేయలేదు. నానీతో మజ్ను సినిమాలో నటించక ముందే మలయాళంలో రెండు సినిమాలు చేసిన అనూ.. ఆ తర్వాత కేవలం టాలీవుడ్ పైనే ఫోకస్ చేసింది. ఇక్కడ అల్లు అర్జున్ సరసన నా పేరు సూర్య.. పవన్ సరసన అజ్ఞాతవాసి చిత్రాల్లో నటించింది. కానీ ఇవేవీ హిట్ కాలేదు. ఆ తర్వాత నాగచైతన్య సరసన సవ్యసాచి లాంటి డిజాస్టర్ మరింత ఇబ్బంది పెట్టింది.అను ఇమ్మాన్యుయేల్ చాలా గ్యాప్ తర్వాత అల్లుడు అదుర్స్ తో కంబ్యాక్ అయ్యింది. ప్రస్తుతం ఆర్.ఎక్స్ 100 దర్శకుడు రూపొందిస్తున్న మహాసముద్రంలో నటిస్తోంది. ఇందులో శర్వానంద్ - సిద్ధార్థ్ కథానాయకులు. ఇక ఈ సినిమా నుంచి అనూ కొత్త లుక్ రిలీజ్ కావాల్సి ఉండగా.. ఇదిగో అనూ స్వయంగా బీచ్ పరిసరాల నుంచి టీజ్ చేసే ఫోటోని రిలీజ్ చేసింది.

బ్లాక్ అండ్ వైట్ లో బ్లర్ లుక్ లో కనిపిస్తున్న ఈ ఫోటోలో అనూ అలా నాలుకను బయటకు చూపిస్తూ టీజ్ చేస్తోంది. ఇంతకీ అనూ టీజింగ్ వెనక మీనింగ్ ఏమిటన్నది తెలియాలంటే `మహాసముద్రం` రిలీజ్ వరకూ ఆగాలేమో! ప్రస్తుతానికి ఈ ఫోటో అంతర్జాలంలో వైరల్ గా మారింది. బ్లాక్ అండ్ వైట్ లుక్ అయినా ఇందులోనూ అనూ హాట్ గా కనిపిస్తోందని కొందరు కామెంట్ చేస్తున్నారు. ఇక చాలా గ్యాప్ తర్వాత తనకో బ్లాక్ బస్టర్ కావాల్సిన టైమ్ ఇది. అందుకే మహాసముద్రంపై బోలెడన్ని హోప్స్ పెట్టుకుందిట. ఇక ఇటీవల ఇన్ స్టా మాధ్యమంలో అనూ రెగ్యులర్ ఫోటోషూట్లను షేర్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే తనకు భారీగా ఫాలోయింగ్ పెరిగింది.