లూజు చొక్కాలో అనూ అందాల విందు

Tue May 18 2021 10:00:01 GMT+0530 (IST)

Anu Emmanuel Latest Stunning Pose In White Dress

అగ్ర హీరోల సరసన కెరీర్ ఆరంభమే అవకాశాలు అందుకుని అదృష్టం కలిసి రాక డిజాస్టర్లతో రేసులో వెనకబడిపోయింది అను ఇమ్మాన్యుయేల్. గల్ఫ్ మూలాలున్న ఈ మల్లూ బ్యూటీకి జయాపజయాలతో సంబంధం లేకుండా అసాధారణ ఫాలోవర్స్ ఉన్నారు. ట్రెడిషనల్ లుక్ లోనూ వేడి పెంచే ప్రత్యేకత అనూ సొంతం. అందుకే హిట్టుతో పనే లేకుండా ఇప్పటికీ అవకాశాలు అందుకుంటోంది.ఇటీవలే బెల్లంకొండ సరసన అల్లుడు అదుర్స్ చిత్రంలో నటించినా మరో పరాజయం అనూని తీవ్రంగా నిరాశపరిచింది. నానీతో మజ్ను మినహా తన కెరీర్ లో సరైన విజయం లేకుపోవడం పెద్ద మైనస్ అయ్యింది.

ఇక తన అభిమానులకు గ్లామరస్ ఫోటో ట్రీట్ ఇవ్వడానికి ఇన్ స్టాలో నిరంతరం టచ్ లో ఉంటోంది. తాజాగా ఇన్ స్టా వేదికగా షేర్ చేసిన ఓ ఫోటోలో అనూ అర్ధనగ్నంగా కనిపించింది. వైట్ లూజ్ షర్ట్ లో అనూ అందాల విందు యువతరానికి మత్తెక్కిస్తోంది. కాటుక కళ్లతో మాయ చేయడం అనూ ప్రత్యేకత. బాటమ్ లెస్ గా థై సొగసుల ఎలివేషన్ హీట్ పెంచుతోంది. ఎంత సింపుల్ గా కనిపిస్తుందో అంతే ఘాటుగా వేడెక్కించడం తనలో యూనిక్ నెస్.

కెరీర్ మ్యాటర్ కి వస్తే.. ప్రస్తుతం `మహా సముద్రం` చిత్రంలో నటిస్తోంది.  అజయ్ భూపతి ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. శర్వానంద్- సిద్ధార్థ్ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్లకు చక్కని స్పందన వచ్చింది.