Begin typing your search above and press return to search.

ఇది ప్రేమ కాదంట.. అల్లు శిరీష్ బూమ్రాంగ్ షేర్ చేసిన అనూ బేబీ..!

By:  Tupaki Desk   |   23 Jun 2021 3:27 PM GMT
ఇది ప్రేమ కాదంట.. అల్లు శిరీష్ బూమ్రాంగ్ షేర్ చేసిన అనూ బేబీ..!
X
యంగ్ హీరో అల్లు శిరీష్ - గార్జియస్ బ్యూటీ అను ఇమ్మాన్యుయేల్‌ జంటగా ''ప్రేమకాదంట'' అనే న్యూ ఏజ్ రొమాంటిక్ ఎంటర్టైనర్ లో నటిస్తున్న విషయం తెలిసిందే. రాకేష్ శశి ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నారు. అల్లు అరవింద్ సమర్పణలో జీఏ2 పిక్చర్స్ బ్యానర్ పై బన్నీ వాస్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇటీవల విడుదలైన రొమాంటిక్ ప్రీ లుక్స్ - ఫస్ట్ లుక్ పోస్టర్ విశేష స్పందన తెచ్చుకున్నాయి. కోవిడ్ నేపథ్యంలో నిలిచిపోయిన ఈ సినిమా షూటింగ్ తిరిగి ప్రారంభించారు.

ఈ విషయాన్ని ఇన్స్టాగ్రామ్ స్టోరీ ద్వారా వెల్లడించిన అను ఇమాన్యుయేల్.. అల్లు శిరీష్ కు సంబంధించిన ఓ బూమ్రాంగ్ పోస్ట్ చేసింది. ఇందులో నవ్వుతూ ఉన్న శిరీష్ నుదుటిపై అను బేబీ తన చేతి వేళ్ళతో తట్టడం కనిపిస్తుంది. ఆన్ స్క్రీన్ విషయం పక్కన పెడితే అను - శిరీష్ ఆఫ్ స్క్రీన్ లో కూడా చాలా క్లోజ్ గా మూవ్ అవుతుంటారు. సోషల్ మీడియాలో వీళ్ళు పెట్టే పోస్టులు చూసేవారికి ఈ విషయం అర్థం అవుతుంది.

ఈ క్రమంలో శిరీష్ - అనూ మ‌ధ్య ఏదో వ్య‌వ‌హారం న‌డుస్తోంద‌ని ఆ మధ్య వార్తలు కూడా వచ్చాయి. దీనికి తగ్గట్లుగా వీరు ప్రస్తుతం నటిస్తున్న ''ప్రేమకాదంట'' సినిమా కూడా లవ్ అండ్ లివింగ్ రిలేష‌న్ షిప్ నేప‌థ్యంలో ఉంటుందని టాక్. ఈ సినిమా సక్సెస్ ఇద్దరి కెరీర్ కు కీలకమనే చెప్పాలి. దీని కోసం అల్లు శిరీష్ భారీ వర్కవుట్ చేసి కంప్లీట్ మేకోవర్ అయ్యాడు. తొలిసారి సిక్స్ ప్యాక్ బాడీని చూపించి సందడి చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. ప్రచార చిత్రాలతో అంచనాలు కలిగించిన 'ప్రేమకాదంట' సినిమా ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో చూడాలి.