స్పార్క్ లో విడుదలవుతున్న మరో థ్రిల్లర్ 'మనిషి'

Thu Jun 17 2021 22:00:01 GMT+0530 (IST)

Another thriller Manishi to be released in Spark

సింగర్ గా నటుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న బిగ్ బాస్ ఫేమ్ నోయల్ హీరోగా తెరకెక్కిన చిత్రం ''మనిషి''(MoneyShe). ఇందులో 'రంగస్థలం' ఫేమ్ పూజిత పొన్నాడ హీరోయిన్ గా నటిస్తోంది. వినోద్ నాగుల ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. 'మనీ' 'షి' అంటూ డిజైన్ చేసిన టైటిల్ పోస్టర్.. ఫస్ట్ లుక్ ఈ సినిమాపై ఆసక్తిని కలిగించాయి. అలానే రాహుల్ సిప్లిగంజ్ ఆలపించిన ‘జాను’ వీడియో సాంగ్ కూడా వీక్షకులను విశేషంగా అలరించింది. డైరెక్ట్ ఓటీటీ విధానంలో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.స్పార్క్ ఓటీటీలో రేపు శుక్రవారం (జూన్ 18) ''మనిషి'' సినిమా విడుదల కానుంది. థ్రిల్లర్ కథాంశంతో రూపొందిన ఈ చిత్రానికి బయ్యవరపు రవి కథ - స్క్రీన్ ప్లే అందించారు. వినోద్ యాజమాన్య సంగీతం సమకూర్చారు. యశ్వంత్ ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ అందించగా.. సతీష్ త్రిపుర సంభాషణలు రాసారు. సత్యనారాయణ నాగుల ఈ చిత్రాన్ని నిర్మించారు. స్పార్క్ ఓటీటీలో ఇప్పటికే విడుదలైన 'డి కంపెనీ' 'క్యాబ్ స్టోరీస్' 'ఫియర్' సినిమాలు ఆకట్టుకున్నాయి. ఈ క్రమంలో వస్తున్న 'మనిషి' ఏ మేరకు మెప్పిస్తుందో చూడాలి.