Begin typing your search above and press return to search.

పుష్ప 2 గురించి మరో సర్‌ ప్రైజింగ్ పుకారు

By:  Tupaki Desk   |   27 March 2023 1:13 PM GMT
పుష్ప 2 గురించి మరో సర్‌ ప్రైజింగ్ పుకారు
X
అల్లు అర్జున్ హీరోగా సుకుమార్‌ దర్శకత్వంలో రూపొందుతున్న పుష్ప 2 సినిమా పై అంచనాలు భారీగా పెరుగుతూనే ఉన్నాయి. పుష్ప మొదటి భాగం పాన్ ఇండియా స్థాయిలో భారీ వసూళ్లు రాబట్టింది. ఉత్తరాదిన ఎలాంటి ప్రమోషన్ చేయకుండానే వంద కోట్లకు పైగా వసూళ్లు రాబట్టిన పుష్ప కచ్చితంగా రెండో పార్ట్ తో భారీగా వసూళ్లు నమోదు చేసే అవకాశాలు ఉన్నాయని ఫ్యాన్స్ నమ్ముతున్నారు.

సౌత్‌ లో ఎలాగూ బన్నీ మరియు సుకుమార్ కు ఉన్న ఫాలోయింగ్ కారణంగా భారీగా వసూళ్లు నమోదు అయ్యే అవకాశం ఉంది. కనుక ఎక్కువగా బాలీవుడ్ ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించే ఉద్దేశ్యంతో సుకుమార్ పుష్ప 2 కి బాలీవుడ్ హంగులు అద్దుతున్నట్లుగా సమాచారం అందుతోంది.

ఇప్పటికే బాలీవుడ్ కు చెందిన ప్రముఖ హీరోయిన్ తో ఐటం సాంగ్ చేయించబోతున్న సుకుమార్‌ మరో పాత్ర కోసం బాలీవుడ్ స్టార్‌ ను సంప్రదిస్తున్నట్లుగా తెలుస్తోంది.

ఇండస్ట్రీ వర్గాల్లో మరియు సోషల్‌ మీడియాలో షికారు చేస్తున్న పుకారు ప్రకారం బాలీవుడ్ కు చెందిన ఆ స్టార్‌ నటుడు సినిమాలో దాదాపు పది నిమిషాల పాటు కనిపించబోతున్నాడట. ఆ బాలీవుడ్ స్టార్‌ కనిపించేది పది నిమిషాలే అయినా సినిమా స్థాయి ఉత్తర భారతంలో రెండు మూడు రెట్లు పెంచడం ఖాయం అనే పుకార్లు కూడా షికార్లు చేస్తున్నాయి.

పుష్ప 2 లో ఇప్పటికే చాలా సర్ ప్రైజ్ లు ప్లాన్ చేశారు. ఇప్పుడు ప్రచారం జరుగుతున్న బాలీవుడ్ స్టార్‌ పుకారు కూడా నిజం అయితే కచ్చితంగా ప్రేక్షకులకు అతి పెద్ద సర్ ప్రైజ్ అవ్వడం ఖాయం. బాలీవుడ్ లో పుష్ప 2 మార్కెట్‌ ఒక్కసారిగా పెరుగుతుందని కూడా మాట్లాడుకుంటున్నారు.

మొత్తానికి పుష్ప 2 సినిమా పై అంచనాలు భారీగా పెరుగుతూనే ఉన్నాయి. రష్మిక మందన్నా హీరోయిన్ గా కంటిన్యూ అవ్వబోతుండగా ఫాహద్ ఫాసిల్ పాత్ర సెకండ్‌ పాత్రలో అత్యంత కీలకంగా ఉంటుందట. అలాగే సునీల్‌ మరియు అనసూయ పాత్రలు కూడా పుష్ప 2 లో ప్రత్యేకంగా నిలుస్తాయని ప్రచారం జరుగుతోంది.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.