టాలీవుడ్ లో మెరుస్తున్న మరో తెలుగు ట్యాలెంట్

Fri Apr 23 2021 06:00:01 GMT+0530 (IST)

Another shining Telugu talent in Tollywood

టాలీవుడ్ లో తెలుగమ్మాయిలకు సరైన అవకాశాలు కల్పించరన్న అపవాదు ఉంది. తెలుగు దర్శకులు ముంబై నుంచి పొరుగు భాషల నుంచి కథానాయికల్ని దిగుమతి చేసుకునేందుకే ఆసక్తిగా ఉంటారని..  దూరపు కొండలు నునుపు అని విమర్శలు వెల్లువెత్తాయి.కానీ ఇటీవల నెమ్మదిగా ఫేజ్ మారుతోంది. తెలుగు గాళ్స్ మోడలింగ్ సహా బుల్లితెర వెండితెర రంగంలో రాణిస్తున్నారు. పెద్ద తెరపై వరుసగా అవకాశాలు అందుకుంటున్నారు. అదే కోవలో ఇటీవల అనన్య నాగళ్ల తెలుగు సినీపరిశ్రమలో షైన్ అవుతోంది.

ఈ బ్యూటీ ఆరంభం మల్లేశం అనే బయోపిక్ చిత్రంలో నటించింది. 2019లో రిలీజైన ఈ చిత్రానికి విమర్శకుల ప్రశంసలు దక్కాయి. అందులో విలేజ్ గాళ్ గా డీగ్లామరస్ పాత్రలో అనన్య చక్కగా నటించారని ప్రశంసలు దక్కాయి. ఇటీవలే రిలీజై బ్లాక్ బస్టర్ విజయం సాధించిన వకీల్ సాబ్ చిత్రంలోనూ అనన్య ఒక కీలక పాత్రను పోషించారు. నివేద థామస్- అంజలి వంటి నాయికలతో పాటు అనన్య నటిగా మెప్పించారు.

ఇతర నాయికల్లానే ఈ భామా సోషల్ మీడియాల్లో యాక్టివ్ గా ఉంది. నిన్న శ్రీరామనవమి పండగ కు స్పెషల్ ఫోటోషూట్ ని అనన్య ఇన్ స్టాలో షేర్ చేసారు. ట్రెడిషనల్ కాటన్ చీరలో ఎంతో సాంప్రదాయ బద్ధంగా కనిపించారు. జెరీ అంచు బ్లూ కాటన్ శారీ ఆకట్టుకుంది. ఈ సమ్మర్ స్పెషల్ ఫోటోషూట్..యువతరంలో వైరల్ గా దూసుకెళుతోంది. అనన్య మరిన్ని క్రేజీ ఆఫర్లతో కెరీర్ పరంగా ఎదగాలని ఆకాంక్షిద్దాం.