పుష్ప 2 నుంచి మరో ఫొటో లీక్.. కాస్త జాగ్రత్తలు తీస్కోండి!

Mon Jan 23 2023 10:42:32 GMT+0530 (India Standard Time)

Another photo leak from Pushpa 2.. Be careful!

పుష్ప సినిమాతో పాన్ ఇండియా స్థాయిలో క్రేజ్ సంపాదించిన స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్... పార్ట్ 1 తో సక్సెక్ అందుకున్నారు. ఇప్పుడు పుష్పకు సీక్వెల్ గా పుష్ప2 తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. అయితే ఇందుకు సంబంధించిన షూటింగ్ కూడా ఇప్పటికే ప్రారంభం అయింది. కొన్ని రోజుల క్రితం ఫస్ట్ షెడ్యూల్ లో భాగంగా ఐదు రోజులు చిత్రీకరణ చేశారు. ప్రస్తుతం విశాఖలో అల్లు అర్జున్ ఇతర తారాగణంపై కీల సన్నివేషాలు తెరకెక్కిస్తున్నట్లు సమాచారం.ఈ క్రమంలో అల్లు అర్జున్ పుష్ప2 కు సంబంధించిన మరో ఫొటో లీకైంది. షూటింగ్ లో ఉన్న స్టైలిక్ స్టార్.. కాస్ట్యూమ్స్ తో ఓ కుర్చీలో కూర్చొని ఉన్న ఫొటో నెట్టింట తెగ వైరల్ గా మారింది. ఇది చూసిన అభిమానులు అందరూ.. చిత్ర బృందానికి పలు సూచనలు చేస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిదని చెబుతున్నారు. పార్ట్ 1 సినిమాలో కూడా ఇలాగే చాలా లీకులు జరిగాయని గుర్తు చేశారు.

పుష్ప సినిమా పార్ట్ వన్ అప్పుడు కూడా చాలా సార్లు లీకయ్యాయి. సినిమా నుంచి కొన్ని పాటలు ఫైట్లు లీకై అయి చిత్ర బృందానికి షాక్ ఇచ్చాయి. దాక్కో దాక్కో మేక పాటను కూడా పలువురు మొబైల్ లో తీసి సోషల్ మీడియాలో పెట్టారు.

ఫైట్ సీన్లను ఎడిటింగ్ రూంలోచి తీసి నెట్టింట వైరల్ చేశారు. దీనిపై గతంలో నిర్మాతలు పోలీసులకు కూడా ఫిర్యాదు చేశారు. అయినప్పటికీ లీకుల పర్వం కొనసాగింది. కాకినాడలో షూటింగ్ జరుగుతుండగా.. కొందరు అల్లు అర్జున్ ఫొటోలను మళ్లీ లీక్ చేశారు.

అయితే ఈ సారి కూడా ఫొటోలు లీకవడంతో.. చిత్ర బృందం చాలా జాగ్రత్తగా ఉండాల్సి వస్తోంది. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా పలువురు ఇలాంటి పనులు చేస్తూనే ఉన్నారు. ఇది ఇలాగే కొనసాగితే సినిమాకే పెద్ద ముప్పు అని అంతా భావిస్తున్నారు.

మరి చూడాలి.. ఈ సారి అయినా అల్లు అర్జున్ సుకుమార్ లు లీకుల బెడద లేకుండా చూసుకుంటారో లేదో. ఎన్ని లీకులు జరిగినా మొదటి పార్ట్ మాత్రం సూపర్ డూపర్ హిట్టైంది. కేవలం ఇండియాలోనే కాకుండా మిగతా దేశాల్లో కూడా భారీ వసూళ్లను రాబట్టింది. పుష్ప 2 ను కూడా అదే అంచనాల మధ్య తెరకెక్కిస్తున్నారు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.