Begin typing your search above and press return to search.

బిగ్ బాస్ సోహెల్ టైమ్ స్టార్ట్.. నిల‌బెడ‌తాడా?

By:  Tupaki Desk   |   18 April 2021 11:26 AM GMT
బిగ్ బాస్ సోహెల్ టైమ్ స్టార్ట్.. నిల‌బెడ‌తాడా?
X
బిగ్ బాస్ 4 టైటిల్ గెలుచుకోలేక పోయినప్పటికీ సయ్యద్ సోహెల్ పేరు ఆ సీజ‌న్ లో మార్మోగింది. షో ఆద్యంతం అత‌డి గేమ్ ఎత్తుగ‌డ ఆక‌ట్టుకుంద‌న్న టాక్ వ‌చ్చింది. బిగ్ బాస్ 4 సీజన్ లో క‌నిపించిన ఇంటి స‌భ్యులు టీవీ ఫిల్మ్ ఆఫర్లను ద‌క్కించుకుంటున్నా.. అందులో సోహెల్ ఎంపిక‌లు తెలివైన‌వ‌న్న టాక్ న‌డుస్తోంది.

తాజాగా లక్కీ మీడియా గ్లోబల్ ఫిల్మ్స్ బ్యానర్ లలో బెక్కెం వేణుగోపాల్ నిర్మిస్తున్న సినిమాలో సోహైల్ న‌టించ‌నున్నాడు. ఈ చిత్రం భిన్నమైన రొమాంటిక్ ఎంటర్ టైనర్ అవుతుందని తెలిసింది. సోహెల్ పుట్టినరోజు సందర్భంగా ఈ చిత్రంపై అధికారిక ప్రకటన చేశారు. త్వ‌ర‌లోనే దర్శకుడు సహా ఇతర తారాగణం సిబ్బంది వివ‌రాల్ని వెల్లడిస్తారు.

సోహైల్ టాలీవుడ్ లో ఉన్న‌ హ్యాండ్స‌మ్ హీరోల్లో ఒక‌రు. అత‌డు ఇత‌ర బ్యాన‌ర్ల‌కు సంత‌కాలు చేస్తున్నారు. కోనాపురంలో జ‌రిగిన క‌థ‌.. యురేక‌ అనే చిత్రాల్లోనూ అత‌డు న‌టిస్తున్నారు.