మరో డిజాస్టర్.. ఈ స్టార్ దర్శకుడు పద్దతి మార్చుకోడా?

Sun Feb 05 2023 07:00:02 GMT+0530 (India Standard Time)

Another disaster.. Will this star director change his method?

ఒకప్పుడు బాలీవుడ్ ప్రేక్షకులు విభిన్న చిత్రాలను ఆధరించేవారు.. ప్రేమ కథలను మరియు కాన్సెప్ట్ బేస్డ్ సినిమాలను సక్సెస్ చేశారు. కానీ గత కొన్నాళ్లుగా హిందీ ప్రేక్షకుల అభిరుచి పూర్తిగా మారినట్టుగా ఉంది. మాస్ సినిమాలు మరియు యాక్షన్ సినిమాలపై ఎక్కువగా ఆసక్తి చూపిస్తూ ఉన్నారు. అందుకే పఠాన్ సినిమా వెయ్యి కోట్ల దిశగా దూసుకు పోతుంది.



ప్రేక్షకుల అభిరుచికి తగ్గట్లుగా ఫిల్మ్ మేకర్స్ తమ మేకింగ్ స్టైల్ ను మార్చుకోకుంటే ఫలితం ఎలా ఉంటుందో ఈ మధ్య కాలంలో చూస్తూనే ఉన్నాం.. తాజాగా మరో సినిమా ఫలితం కూడా ప్రేక్షకుల అభిరుచి మారిందని.. ఫిల్మ్ మేకర్స్ మారాల్సిందే అంటూ చెప్పకనే చెప్పింది.

బాలీవుడ్ లో ఒకప్పుడు స్టార్ ఫిల్మ్ మేకర్ గా గుర్తింపు దక్కించుకున్న అనురాగ్ కశ్యప్ ఇప్పుడు మినిమం సక్సెస్ లను దక్కించుకోలేక పోతున్నాడు. ఒకప్పుడు అనురాగ్ కశ్యప్ సినిమాల కోసం ప్రేక్షకులు ఎదురు చూసేవారు.. వందల కోట్ల వసూళ్లు సాధించిన సినిమాలను అందించిన అనురాగ్ కశ్యప్ తాజా సినిమాతో కనీసం పది కోట్ల వసూళ్లు దక్కించుకోవడం గగనం అయ్యింది.

తాజాగా ఈ స్టార్ ఫిల్మ్ మేకర్ ఆల్మోస్ట్ ప్యార్ విత్ డీజే మొహబ్బత్ అనే విభిన్నమైన లేడీ ఓరియంటెడ్ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చాడు. నిన్న విడుదల అయిన ఈ సినిమా మినిమం కలెక్షన్స్ ని రాబట్టలేకపోయింది. కనీసం కోటి రూపాయల వసూళ్లు దక్కించుకోలేదు.

అనురాగ్ కశ్యప్ కి ఉన్న క్రేజ్ మరియు స్టార్ డమ్ కి కాస్త మాంచి కమర్షియల్ సినిమాలను చేస్తే ఏ రేంజ్ లో వసూళ్లు నమోదు అవుతాయో అర్థం చేసుకోవచ్చు. అందరికి కూడా స్టార్ దర్శకుడు పద్దతి మార్చకోవాలని ఉంది.. కానీ ఆయన మాత్రం ఇంకా అప్పటి మూస స్క్రిప్ట్ లనే ఎంపిక చేసుకుంటూ ఉన్నాడు.

తదుపరి సినిమా అయినా అనురాగ్ కశ్యప్ పరువు నిలిపే విధంగా వసూళ్లు రాబట్టాలని ఆయన అభిమానులు కోరుకుంటున్నారు. అందుకు ఆయన నుండి కాస్త మాస్ ఎలిమెంట్స్ తో సినిమా రావాల్సి ఉంది. మరి ఆ దిశగా ప్రయత్నాలు చేస్తాడా అనేది చూడాలి.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.