పూరి ఆశీస్సులతో మరో బంపర్ ఆఫర్

Sun Mar 07 2021 10:00:01 GMT+0530 (IST)

Another bumper offer with Puri blessings

12 ఏళ్ల క్రితం డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ తమ్ముడు సాయి రామ్ శంకర్ నటించిన బంపర్ ఆఫర్ సినిమా వచ్చింది. ఆ సినిమా పర్వాలేదు అనిపించుకుంది. సాయి రామ్ శంకర్ కు నటుడిగా గుర్తింపు తెచ్చి పెట్టింది. అయితే ఆ సినిమా తర్వాత సాయి రామ్ శంకర్ ఎంపిక చేసుకున్న ప్రాజెక్ట్ లు మరియు కథలు ఆయనకు నిరాశ కలిగించాయి. ఈమద్య కాలంలో సాయి రామ్ శంకర్ పూర్తిగా కనుమరుగయ్యాడు అనుకుంటున్న సమయంలో మళ్లీ హీరోగా ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్దం అయ్యాడు. బంపర్ ఆఫర్ 2 టైటిల్ తో ఈయన రీ ఎంట్రీకి సిద్దం అయ్యాడు. ఉగాది కానుకగా ఈ సినిమాను ప్రారంభించబోతున్నట్లుగా ప్రకటించారు.పూరి జగన్నాథ్ ఆశీర్వాదంతో బంపర్ ఆఫర్ కు దర్శకత్వం వహించిన జయ రవీంద్ర రెండవ పార్ట్ కు కూడా దర్శకుడిగా వ్యవహరించబోతున్నాడు. బంపర్ ఆఫర్ ను పూరి జగన్నాధ్ నిర్మించగా ఈ రెండవ పార్ట్ ను మాత్రం సాయి రామ్ శంకర్ స్వయంగా సురేష్ యల్లం రాజుతో కలిసి నిర్మిస్తున్నాడు. ఈ సినిమాకు సంబంధించిన పూర్తి వివరాలను అతి త్వరలోనే వెళ్లడించబోతున్నట్లుగా పేర్కొన్నారు. చాలా కాలం తర్వాత పూరి తమ్ముడు చేస్తున్న ఈ సినిమా ఎలాంటి ఫలితాన్ని దక్కించుకుంటుంది అనేది ఆసక్తికర విషయం. ఈ సినిమాతో టాలీవుడ్ లో పూరి మళ్లీ బిజీ అయ్యేనా చూడాలి.