విడాకుల బాటలో తెలుగు సినీ హీరో కుమార్తె

Tue Oct 22 2019 12:24:16 GMT+0530 (IST)

బాలీవుడ్ లో మాదిరే టాలీవుడ్ లోని సినీ ప్రముఖుల ఇళ్లల్లో విడాకులు కామన్ కానున్నాయా? అన్నది ఇప్పుడు పెద్ద ప్రశ్నగా మారింది. బాలీవుడ్ ఇండస్ట్రీకి సంబంధించి చూస్తే.. నటీనటులే కాదు.. దర్శకులు.. ఇతర సాంకేతిక నిపుణులతో పాటు.. ఇండస్ట్రీలోని ప్రముఖుల ఇళ్లల్లో ప్రేమ.. పెళ్లి.. విడాకులు లాంటివి తరచూ వినిపిస్తూ ఉంటాయి. ఒక జంట ఎప్పుడు కలుస్తారో.. మరెప్పుడు విడిపోతారో అన్నట్లుగా ఉంటుంది. దీనికి భిన్నంగా తెలుగు ఇండస్ట్రీలో వైవాహిక బంధాలు కొనసాగేవి.ఇప్పుడు బాలీవుడ్ మాదిరే టాలీవుడ్ లోనూ విడాకులు తీసుకునే వారి సంఖ్య పెరుగుతోందని చెబుతున్నారు. దీనికి తగ్గట్లే ఇటీవల కాలంలో చోటు చేసుకుంటున్న పరిణామాల్ని చెబుతున్నారు. మొన్నటికి మొన్ననే మంచు మనోజ్ అధికారికంగా తన భార్యతో తాను విడిపోతున్నట్లుగా ప్రకటించి షాకిచ్చారు. మూడేళ్ల క్రితం తాను పెళ్లాడిన ప్రణతి రెడ్డితో విడాకులు తీసుకుంటామని ఆయన వెల్లడించారు.

కారణం ఏదైనా.. మంచు ఫ్యామిలీలో చోటుచేసుకున్న పరిణామానికి చాలామంది బాధ పడ్డారు. అయ్యో.. ఇలా జరిగిందేమిటి? అని ఫీలైనోళ్లు లేకపోలేదు. ఇదిలా ఉంటే.. తాజాగా మరో షాకింగ్ న్యూస్ బయటకు వచ్చింది. టాలీవుడ్ ఇండస్ట్రీలో పెద్ద హీరో కుమార్తె ఒకరు విడాకుల దిశగా పయనిస్తున్నట్లుగా పక్కా న్యూస్ లీక్ అయ్యింది. కొన్నేళ్ల క్రితం ఒక బిజినెస్ మ్యాన్ తో పెళ్లి జరిగినప్పటికీ.. వారి మధ్య మనస్పర్థలు అంతకంతకూ ఎక్కువ అవుతున్న వేళ.. వారిక కలిసి ఉండటం కష్టమని డిసైడ్ అయినట్లుగా తెలుస్తోంది. దీంతో.. ఆ జంట విడిపోయేందుకు సిద్ధం కాగా.. సదరు పెద్ద హీరో కూడా కుమార్తె నిర్ణయానికి ఓకే చెప్పినట్లు తెలుస్తోంది. చూస్తుంటే.. నెమ్మదిగా టాలీవుడ్ సైతం బాలీవుడ్ మాదిరి మారుతున్నట్లుగా సంకేతాలు వినిపిస్తున్నాయని చెప్పక తప్పదు.