Begin typing your search above and press return to search.

బిబి4 : దివి బ్యాగ్‌ సర్దేసుకుంది

By:  Tupaki Desk   |   25 Oct 2020 11:50 AM GMT
బిబి4 : దివి బ్యాగ్‌ సర్దేసుకుంది
X
దసరా సందర్బంగా నేడు మూడు గంటల భారీ ఎపిసోడ్‌ ప్రారంభం కాబోతుంది. సమంత హోస్ట్‌ గా రావడంతో పాటు హైపర్‌ ఆది పాయల్‌ రాజ్‌ పూత్‌ హీరో కార్తీక్‌ లు స్టేజ్‌ పై సందడి చేశారు. హౌస్‌ మెంట్స్‌ తో సమంత మాట్లాడిన మాటలు ప్రోమోలో సదరాగా అనిపిస్తున్నాయి. మొత్తానికి ఈ వారం షో చాలా సరదాగా సాగుతుందని పండుగ వాతావరణంను మరింతగా పెంచుతుందనే నమ్మకంను అంతా వ్యక్తం చేస్తున్నారు. పండుగ అవ్వడంతో పాటు సమంత హోస్టింగ్ అవ్వడం వల్ల ఈ వారంకు ఎలిమినేషన్‌ ఉండక పోవచ్చు అంటూ చాలా బలంగా అంతా నమ్ముతున్నారు. కాని ఈ వారం ఎలిమినేషన్‌ ఉంటుందని సమంత ఒకరిని బయటకు పంపించబోతుందని చెబుతున్నారు.

ఈ వారం ఎలిమినేషన్‌ కు నామినేట్‌ అయిన వారు అంతా కూడా బలమైన కంటెస్టెంట్స్‌. అయినా ఒకరు ఎలిమినేట్‌ అవ్వాల్సిందే. మోనాల్‌ కు తక్కువ ఓట్లు గత వారం పడ్డాయి. ఈ వారం కూడా ఆమెకే తక్కువ ఓట్లు పడ్డట్లుగా టాక్‌ వినిపిస్తుంది. అయినా కూడా ఆమెను ఉంచి దివిని ఎలిమినేట్ చేసినట్లుగా మీడియా సర్కిల్స్‌ లో ప్రచారం జరుగుతోంది. దివి కేవలం అమ్మ రాజశేఖర్‌ తో సన్నిహితంగా ఉంటుంది. అంతకు మించి ఆమె ఎక్కువగా కనిపించడం లేదు.

టాస్క్‌ ల సమయంలో ఆమె పెద్దగా పట్టించుకోవడం లేదు. అప్పుడప్పుడు హీరోయిన్‌ మాదిరిగా అందాల ఆరబోత చేస్తుంది. అంతకు మించి ఆమె వల్ల ఫుటేజ్‌ రావడం లేదు. అందుకే ఆమెను ఎలిమినేట్‌ చేయాలనే నిర్ణయానికి వచ్చారట. మరి కాసేపట్లో ప్రారంభం కాబోతున్న షో అన్ని క్లారిటీ వస్తాయి. సోషల్‌ మీడియాలో ఈ వార్త తెగ వైరల్‌ అవుతున్నా కూడా దివి ఎలిమినేట్‌ అవ్వదు అని చాలా నమ్మకంగా అంతా ఉన్నారు. ఏం జరుగుతుందో చూద్దాం.