Begin typing your search above and press return to search.

ప్రభాస్ - మారుతి.. మరో ప్లాన్ రెడీ!

By:  Tupaki Desk   |   29 May 2023 1:11 PM GMT
ప్రభాస్ - మారుతి.. మరో ప్లాన్ రెడీ!
X
ప్రభాస్ మారుతీ దర్శకత్వంలో ఒక హారర్ మూవీ చేస్తున్న విషయం తెలిసిందే. వరుసగా ప్లాన్ ఇండియా సినిమాలను లైన్లో పెట్టిన ప్రభాస్ ఈ సినిమాను మాత్రం చాలా సైలెంట్ గా చప్పుడు కాకుండానే ఫినిష్ చేసేందుకు ప్రయత్నం చేస్తున్నాడు. ప్రభాస్ సినిమా అంటేనే ప్రతి చిన్న అప్డేట్ కూడా సోషల్ మీడియాలో వైరల్ అయ్యే విధంగా చిత్ర నిర్మాతలు దర్శకులు ప్రయత్నాలు చేస్తూ ఉంటారు.

కానీ మారుతీతో చేస్తున్న సినిమా విషయంలో మాత్రం అంతా గోప్యంగా జరుగుతోంది. ఎక్కడా కూడా అధికారికంగా ఇప్పటివరకు ఈ సినిమాకు సంబంధించిన పోస్టర్ గానే అలాగే ఇతర క్యాస్ట్ డీటెయిల్స్ కానీ విడుదల చేయలేదు. అసలు ఈ సినిమాను మొదలు పెట్టినప్పుడు కొన్ని సీన్స్ చూసిన తర్వాత ప్రభాస్ సినిమాను ఫినిష్ చేయాలా లేదా అని అనుకున్నాడు.

మారుతి మీద నమ్మకం ఉన్నప్పటికీ కూడా ప్రస్తుతం మార్కెట్లో అతనిపై వస్తున్న నెగిటివ్ కామెంట్స్ కారణంగా ప్రభాస్ ఓ అడుగు వెనక్కి వేయాలని అనుకున్నాడు. కానీ కొంత వర్క్ చూసిన తర్వాత సినిమాను పూర్తి చేయవచ్చు అని నమ్మకం కలిగింది. దీంతో వీలైనంత తొందరగా మారుతి సినిమాను ఫినిష్ చేయాలని అనుకుంటున్నాడు.

ఈ సినిమాకు రాజా డీలక్స్ అనే టైటిల్ కూడా పరిశీలనలో ఉంది. ఇక లేటెస్ట్ అప్డేట్ విషయానికి వస్తే.. థమన్ ను మ్యూజిక్ డైరెక్టర్ గా సెలెక్ట్ చేసే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. ఇక ఇప్పటికే కొన్ని కీలకమైన సన్నివేశాలను పూర్తి చేసుకున్న ప్రభాస్ మరొక ఇంపార్టెంట్ షెడ్యూల్ను జూన్ మొదటి వారంలో స్టార్ట్ చేయాలని అనుకుంటున్నారు.

ఆ షెడ్యూల్లో మాళవిక మోహన్ కూడా పాల్గొనే అవకాశం ఉంది. ఇక మరి కొంతమంది సీనియర్ ఆర్టిస్టులతో ఒక ఫ్యామిలీ డ్రామాకు సంబంధించిన సీన్స్ ను మారుతి షూట్ చేయబోతున్నాడట.

అంచనాలకు తగ్గట్టుగా ఈ సినిమాను తెరపైకి తీసుకురాబోతున్నట్లు తెలుస్తోంది. ఇక సినిమాను 2024 సమ్మర్లో ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చే అవకాశం ఉన్నట్లు టాక్ అయితే వినిపిస్తోంది.