పూరికి మరో పాన్ ఇండియా ఆఫర్

Wed Jun 09 2021 21:00:01 GMT+0530 (IST)

Another Pan India offer for Puri

డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాద్ ప్రస్తుతం విజయ్ దేవరకొండతో 'లైగర్' సినిమాను తెరకెక్కిస్తున్న విషయం తెల్సిందే. భారీ అంచనాల నడుమ రూపొందుతున్న లైగర్ సినిమా చిత్రీకరణ సగం కు పైగా పూర్తి అయ్యింది. కరోనా కారణంగా నిలిచి పోయిన ఈ సినిమా షూటింగ్ ను మళ్లీ ప్రారంభించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇదే సమయంలో పూరి రెండు మూడు కథలను సిద్దం చేశాడని తెలుస్తోంది. లైగర్ సినిమా నిర్మాణంలో భాగస్వామిగా ఉన్న బాలీవుడ్ స్టార్ ఫిల్మ్ మేకర్ కరణ్ జోహార్ మరో సినిమాను పూరితో నిర్మించాలనే ఆసక్తితో ఉన్నట్లుగా సమాచారం అందుతోంది.



విశ్వసనీయంగా అందుతున్న సమాచారం ప్రకారం మరో పాన్ ఇండియా మూవీని పూరితో కలిసి నిర్మించేందుకు కరణ్ జోహార్ ఇప్పటికే ఒప్పందం చేసుకున్నాడట. ఆ పాన్ ఇండియా మూవీలో సౌత్ హీరో నటిస్తాడని కూడా వార్తలు వస్తున్నాయి. పూరి కథలు మరియు ఆయన మేకింగ్ స్టైల్ బాలీవుడ్ ఫిల్మ్ మేకర్స్ స్టైల్ లో ఉంటుంది. కనుక ఆయనతో వరుసగా పాన్ ఇండియా స్థాయి సినిమాలు నిర్మించాలని కరణ్ భావిస్తున్నాడట. పూరి జగన్నాద్ ఇప్పటికే బాలీవుడ్ లో అమితాబ్ సినిమా తో గుర్తింపు దక్కించుకున్నాడు.

లైగర్ సినిమా తో అక్కడ సక్సెస్ ను దక్కించుకుంటే ఖచ్చితంగా సినిమా మరో రేంజ్ లో ఉంటుందనే నమ్మకంను వ్యక్తం చేస్తున్నారు. పూరి జగన్నాద్ ఇటీవల కాలంలో తెలుగులో కంటే ఎక్కువగా ఇతర భాషల సినిమాలపై ఆసక్తి చూపిస్తున్నట్లుగా అనిపిస్తుంది. పెద్ద ఎత్తున అక్కడ సినిమాలను మేక్ చేయాలని పూరి భావిస్తున్నాడేమో అంటూ టాక్ వినిపిస్తుంది. ప్రముఖ దర్శకులు పాన్ ఇండియా సినిమాలు అంటూ ఉన్న ఈ సమయంలో పూరి నుండి కూడా వరుసగా పాన్ ఇండియా సినిమాలు వస్తాయని అభిమానులు ఆశిస్తున్నారు.