మరో లక్కీ ఆఫర్ కొట్టేసిన సుజిత్

Wed Mar 29 2023 21:23:53 GMT+0530 (India Standard Time)

Another Lucky Offer For Sujith

రన్ రాజా రన్ సినిమాతో డైరెక్టర్ గా మారిన సుజీత్ సింగ్ రెండో సినిమాకే ఏకంగా ప్రభాస్ ను డైరెక్ట్ చేసే అవకాశం దక్కించుకున్నాడు. యూవీ ప్రొడక్షన్స్ బ్యానర్ లో ప్రభాస్ హీరోగా సాహో అనే భారీ బడ్జెట్ సినిమా చేశాడు. కానీ ఆ సినిమా కమర్షియల్ గా వర్కౌట్ అవలేదు. హిందీలో కలెక్షన్స్ బానే వచ్చినా తెలుగులో మాత్రం ఊహించిన మేర ఫలితాన్ని అందుకోలేకపోయింది.ఆ దెబ్బతో సుజిత్ మరో సినిమా ఒప్పుకోవడానికి చాలా సమయం పట్టింది. మధ్యలో మెగాస్టార్ చిరంజీవి లూసిఫర్ స్క్రిప్ట్ పనులు కూడా కొన్నాళ్లు చూశాడు. కానీ డైరెక్టర్ మాత్రం కాలేకపోయాడు. అయితే ఎట్టకేలకు పవన్ కళ్యాణ్ కి ఒక స్క్రిప్ట్ చెప్పి ఒప్పించిన సుజిత్ ఒరిజినల్ గ్యాంగ్ స్టార్ పేరుతో ఆ సినిమా తెరకెక్కించే ప్రయత్నాలు చేస్తున్నాడు.

ప్రస్తుతానికి పవన్ కళ్యాణ్ వేరే సినిమాలో షూటింగ్స్ లో బిజీ బిజీగా గడుపుతూ రాజకీయాల మీద కూడా దృష్టి పెడుతున్నారు. ఈ నేపథ్యంలో సుజీత్ సింగ్ కి ఇంకా పవన్ డైరెక్ట్ చేసే టైం రాకపోవడంతో ప్రస్తుతానికి ప్రీ ప్రొడక్షన్ పనుల్లో బిజీ బిజీగా గడుపుతున్నాడు.

సినిమా షూటింగ్ ఎక్కడ చేయాలని ఇప్పటికే లొకేషన్స్ వెతికే పనిలో కూడా పడ్డాడు. డీవీవీ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ మీద డీవీవీ దానయ్య ఈ సినిమాని భారీ బడ్జెట్ తో తెరకెక్కించే అవకాశాలు కనిపిస్తున్నాయి.

ఒరిజినల్ గ్యాంగ్ స్టార్ అనే పేరుతో సంబోధిస్తున్నారు. కానీ ఆ పేరుతో రిలీజ్ చేస్తారా లేదా అనే విషయం మీద క్లారిటీ లేదు. కేవలం పవన్ కళ్యాణ్ సుజిత్ కాంబినేషన్లో సినిమా అనే అనౌన్స్మెంట్ తప్ప ఆ సినిమాకి సంబంధించి ఎలాంటి వివరాలు బయటకు రాకుండా సినిమా యూనిట్ జాగ్రత్త పడింది.

ఇప్పుడు ఆసక్తికర అంశం ఏమిటంటే... ఈ సినిమా పూర్తి అయిన వెంటనే హోంబాలే ఫిలింస్ బ్యానర్ మీద సుజిత్ ఒక సినిమా చేయడానికి అడ్వాన్స్ తీసుకున్నట్లుగా తెలుస్తోంది. హొంబలే ఫిలిమ్స్ కేజీఎఫ్ సినిమా ద్వారా పాన్ ఇండియా రేస్ లోకి అడుగుపెట్టి తర్వాత కాంతారా లాంటి సినిమాని కూడా రిలీజ్ చేసింది. ఈ నేపథ్యంలో సుజిత్ సినిమా కూడా పాన్ ఇండియా లెవెల్ లో ఉండే అవకాశం ఉందని అంటున్నారు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.