Begin typing your search above and press return to search.

మ‌రో బెర్ముడా ట్ర‌యాంగిల్‌.. అక్క‌డికి వెళ్తే తిరిగి రాలేరు!

By:  Tupaki Desk   |   20 July 2021 12:30 AM GMT
మ‌రో బెర్ముడా ట్ర‌యాంగిల్‌.. అక్క‌డికి వెళ్తే తిరిగి రాలేరు!
X
బెర్ముడా ట్ర‌యాంగిల్‌..' ఇది చాలా మందికి సుప‌రిచిత‌మే. వాయువ్య అట్లాంటిక్ మ‌హాస‌ముద్రంలోని ఒక ప్రాంతం ఇది. దీన్నే 'డెవిల్స్ ట్ర‌యాంగిల్' అని కూడా అంటారు. ఈ ప్రాంతం యొక్క మిస్టరీ ఏంటనేది ఇప్పటి వరకు ఎవ్వరూ చెప్పలేకపోయారు. మరి, అంతగా ఇందులో ఏముందీ అన్న‌ప్పుడు.. ఇదొక ప్ర‌మాద‌క‌ర ప్రాంతం. అంతు చిక్క‌ని ప్ర‌మాద‌క‌ర ప్రాంతం. ఎంత‌లా అంటే.. అక్క‌డికి వెళ్లిన వారు ఇప్ప‌టి వ‌ర‌కు తిరిగి రాలేదు. ఆ ప్రాంతం మీదుగా వెళ్లేందుకు ప్ర‌య‌త్నించిన భారీ నౌక‌లు అవ‌త‌లి వైపున‌కు చేరుకోలేదు. వెన‌క్కి తిరిగి కూడా రాలేదు.

నౌక‌లు రాలేదంటే.. అక్క‌డ ఏదైనా సుడిగుండం లాంటిది ఉంద‌ని కాసేపు అనుకుందాం. అదే.. భారీ ఓడ‌ల‌ను సైతం మిగేస్తుంద‌ని అనుకుందాం. కానీ.. ఆకాశంలో వెళ్లే విమానాలు సైతం ఆ ప్రాంతానికి చేరుకోగానే.. అదృశ్య‌మైతే ఎలా ఉంటుందీ? ఇదే.. అంతు చిక్క‌ని ప్ర‌శ్న‌. ఇప్ప‌టి వ‌ర‌కు చాలా ఓడ‌లు, విమానాలు ఆ బెర్ముడా ట్రయాంగిల్ ప్రాంతం వ‌ద్ద‌కు వెళ్లి క‌నిపించ‌కుండా పోయాయి. అలా.. ఎందుకు జ‌రిగింది? దానికి కారణం ఏంటీ? అన్న‌ది ఎవ్వ‌రూ క‌నిపెట్ట‌లేక‌పోయారు.

దీంతో.. ఎవ‌రికి తెలిసిన క‌థ‌లు వారు అప్లై చేసుకున్నారు. ఎవ‌రికి తెలిసిన సిద్ధాంతాలు వారు వ‌ర్తింప‌జేసుకున్నారు. చేసుకుంటున్నారు. మాన‌వ త‌ప్పిదాలే ఈ ఘ‌ట‌న‌ల‌కు కార‌ణాలు అయి ఉండొచ్చ‌ని కొంద‌రు అంటే.. ప్ర‌కృతి వైప‌రీత్యాలు ఏమైనా కార‌ణం కావొచ్చ‌ని మ‌రికొంద‌రు అంటున్నారు. ఇంకొంద‌రు గ్ర‌హాంత‌ర వాసులు కార‌ణం కావొచ్చ‌ని ఇంకొంద‌రు చెప్పారు. అయితే.. ఎవ‌రి అభిప్రాయాలు వారు చెప్పిన‌ప్ప‌టికీ.. వాస్త‌వం ఏంట‌న్న‌ది మాత్రం ఇప్ప‌టి వ‌ర‌కూ తెలియ‌లేదు. ఇప్ప‌టి వ‌ర‌కూ బెర్ముడా ట్రాయాంగిల్ మిస్ట‌రీగానే ఉండిపోయింది.

అయితే.. ఇదేవిధమైన ప్రాంతం భార‌త‌దేశంలోని ఈశాన్య రాష్ట్ర‌మైన అరుణాచ‌ల్ ప్ర‌దేశ్ - టిబెట్ మ‌ధ్య ఉంది. ఆ ప్రాంతాన్ని 'షాంగ్రి - లా వ్యాలీ' అంటారు. ఇదొక లోయ‌గా చెబుతారు. దీని గురించి చ‌రిత్ర‌లో చాలా వ‌ర‌కు క‌థ‌నాలు ఉన్నాయి. ఇక్క‌డ స‌మ‌యం ఆగిపోతుంద‌ని అంటారు. అంటే.. కాలం స్తంభించిపోతుంద‌ట‌. అందువ‌ల్ల వ‌యసు పెర‌గ‌డం అనేది ఉండ‌ద‌ట‌. ఇక్క‌డికి వెళ్లిన వారు కావాల్సినంత కాలం జీవించొచ్చు అని ఒక న‌మ్మ‌కం. ఈ విధ‌మైన విశ్వాసాలు ఎన్నో ఉన్నాయి. అయితే.. ఎప్ప‌టిక‌ప్పుడు ఈ విష‌యం వెలుగులోకి వ‌స్తుండ‌డంతో చ‌ర్చ ఎక్కువ‌గా జ‌రుగుతోంది.

అయితే.. ఎన్నో ద‌శాబ్దాల కాలం నుంచి ఈ షాంగ్రి - లా వ్యాలీ గురించిన చ‌ర్చ జ‌రుగుతోంది. ఈ నేప‌థ్యంలో ఈ ప్రాంతం ఎక్క‌డ ఉంది? అని తెలుసుకునేందుకు చాలా మంది ప్ర‌య‌త్నించారు. ఎంతో మంది ఎన్నో విధాలుగా ప్ర‌య‌త్నాలు కొన‌సాగించారు. అరుణాచ‌ల్ ప్ర‌దేశ్ - టిబెట్ మ‌ధ్య ఈ ప్రాంతం కోసం గాలించారు. కానీ.. దాన్ని క‌నిపెట్ట‌లేక‌పోయారు. అయితే.. దీనిపై ప‌లు క‌థ‌లు ఇప్ప‌టికీ ప్ర‌చారంలో ఉన్నాయి.

ప్ర‌ఖ్యాత తంత్ర ర‌చ‌యిత అరుణ్ కుమార్ శ‌ర్మ దీనికి సంబందించి 'ద‌ట్ మిస్టీరియ‌స్ వ్యాలీ ఆఫ్ టిబెట్' అనే పుస్తకంలో ఈ షాంగ్రి - లా వ్యాలీ గురించి ప్ర‌స్తావించాడు. దీని ప్ర‌కారం.. ఈ ప్ర‌పంచంలో ఏదైనా వ‌స్త‌వు లేదా ఎవ‌రైనా వ్య‌క్తులు క‌నిపించ‌కుండా పోయే ఫ‌స్ట్ ప్లేస్ బెర్ముడా ట్ర‌యాంగిల్ అని రాసుకొచ్చారు. ఆ త‌ర్వాత స్థానంలో షాంగ్రి లా వ్యాలీ ఉంద‌ని చెప్పారు. ఇక‌, ఈ లోయ గురించి టిబెట్ లోని 'కాల్ విజ్ఞాన్‌' లో కూడా ప్ర‌స్తావించారు. అదేవిధంగా.. జేమ్స్ హిల్ట‌న్ రాసిన 'లాస్ట్ హారిజ‌న్‌' అనే బుక్ లోనూ దీని గురించి రాశారు. అయితే.. ఇదొక ఊహాజ‌నిత ప్ర‌దేశ‌మే త‌ప్ప‌, వాస్త‌వం కాదని రాశారు. మొత్తానికి ప్ర‌పంచంలో మాన‌వాతీత శ‌క్తులు ఏవో ఉన్నాయ‌ని భావించే ప్రాంతాల్లో బెర్ముడా ట్రయాంగిల్ తోపాటు 'షాంగ్రి - లా వ్యాలీ' కూడా చేరింది. మరి, ఇందులో వాస్తవం ఎంత అనేదానికి కాలమే సమాధానం చెప్పాలి.