మహేష్ బాబు సినిమా లో మరో బాబు?

Tue Jan 25 2022 12:37:01 GMT+0530 (IST)

Another Babu in Mahesh Babu movie

సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం చేస్తున్న సర్కారు వారి పాట చిత్రీకరణ పూర్తి అవ్వడమే ఆలస్యం త్రివిక్రమ్ దర్శకత్వంలో సినిమాను చేయబోతున్నాడు. ఇప్పటికే ప్రారంభం అవ్వాల్సిన మహేష్ బాబు.. త్రివిక్రమ్ ల కాంబో మూవీ కరోనా వల్ల ఆలస్యం అవుతూ వస్తోంది. ఎట్టకేలకు సినిమా చిత్రీకరణ కు సంబంధించిన ఏర్పాట్లు జరుగుతున్నాయి.స్క్రిప్ట్ విషయంలో ఇప్పటికే క్లారిటీ వచ్చారు. మొత్తం స్క్రిప్ట్ ను పూర్తి చేసిన త్రివిక్రమ్ ప్రస్తుతం నటీ నటుల ఎంపిక విషయం పై శ్రద్ద పెట్టినట్లుగా తెలుస్తోంది. మహేష్ బాబుకు జోడీ ఎవరు అనే విషయంపై ఇప్పటికే ఒక స్పష్టతకు వచ్చారట. కాని ఇప్పటి వరకు ఆ విషయాన్ని అధికారికంగా ప్రకటించడం లేదు.

మహేష్ బాబు ను ఢీ కొట్టేందుకు స్టార్ హీరోను విలన్ గా నటింపజేస్తున్నట్లుగా తెలుస్తోంది.

ఇక ఈ సినిమా లో మంచు హీరో మోహన్ బాబు ను నటింపజేసే ప్రయత్నాలు జరగుతున్నాయని వార్తలు వస్తున్నాయి. మోహన్ బాబు ను ఈ సినిమా లో కీలక పాత్రకు గాను చూపించబోతున్నట్లుగా తెలుస్తోంది.

త్రివిక్రమ్ ఇప్పటికే మోహన్ బాబును కలిసి చర్చించారనే పుకార్లు సినీ వర్గాల్లో చర్చ జరగుతున్నాయి. మోహన్ బాబు ఈమద్య కాలంలో నటిస్తున్న సినిమాలు చాలా తగ్గాయి. సన్నాఫ్ ఇండియా అనే సినిమాను ఆయన చేస్తున్నాడు. కరోనా వల్ల ఆలస్యం అవుతున్న ఆ సినిమా తుది దశకు చేరుకుంది. త్వరలోనే ఆ సినిమాను విడుదల చేసేలా ప్లాన్ చేస్తున్నారు.

ఒక వైపు సోలో హీరో సినిమాలు చేస్తూనే మరో వైపు క్యారెక్టర్ ఆర్టిస్టుగా కూడా కెరీర్ ను కొనసాగించాలని మోహన్ బాబు భావిస్తున్నట్లుగా తెలుస్తోంది.

మహేష్ బాబు సినిమాలో కీలక పాత్రకు త్రివిక్రమ్ అడిగిన వెంటనే మోహన్ బాబు ఓకే అన్నట్లుగా తెలుస్తోంది. మహేష్ బాబుకు మామయ్య పాత్రలో మోహన్ బాబు కనిపించబోతున్నట్లుగా తెలుస్తోంది. మోహన్ బాబు ఇక మీదట క్యారెక్టర్ ఆర్టిస్టుగా వరుస సినిమాలు చేయాలని అభిమానులు కోరుకుంటున్నారు.

ఈమద్య కాలంలో సెకండ్ ఇన్నింగ్స్ మొదలు పెట్టి మంచి విజయాలను దక్కించుకున్న వారు చాలా మంది ఉన్నారు. కనుక మోహన్ బాబు కూడా మహేష్ బాబు.. త్రివిక్రమ్ సినిమా తో తన సెకండ్ ఇన్నింగ్స్ ను కొత్తగా ప్రారంభించి మళ్లీ ప్రేక్షకులను బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో ఎంటర్ టైన్ చేయాలని అభిమానులు మరియు ఇండస్ట్రీ వర్గాల వారు ఆశ పడుతున్నారు