అన్నీ మంచి శకునములే.. మరో స్వీట్ సాంగ్ రిలీజ్..!

Fri Mar 31 2023 11:29:52 GMT+0530 (India Standard Time)

Another Song Release From 'Anni Manchi Sakunamule' Movie

సంతోష్ శోభన్ మాలవికా నాయర్ హీరో హీరోయిన్లుగా రాబోతున్న అన్నీ మంచి శకునములే సినిమా గురించి తెలుగు సినీ ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. నందినీ రెడ్డి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని స్వప్న సినిమా మరియు మిత్ర విందా మూవీస్ బ్యానర్లపై ప్రియాంక దత్ సినిమాను నిర్మిస్తున్నారు.అయితే శ్రీరామనవమి పండుగ సందర్భంగా ఈ సినిమా నుంచి ఓ అదిరిపోయే లిరికల్ వీడియో సాంగ్ ను విడుదల చేశారు. సీతా కల్యాణ వైభోగమే.. అంటూ సాగే ఈ పాటను ప్రేక్షకులను ప్రత్యేకంగా ఆకట్టుకుంటోంది. ముఖ్యమంగా ఫ్యామిలీ ఆడియన్స్ ఈ సినిమాకు ఎక్కువగా కనెక్ట్ అవుతున్నారు. పెళ్లిపై తీసిన ఈ సాంగ్ అందరి జీవితాల్లోనూ ఉంటుంది కాబట్టి మరీ ఆసక్తి చూపిస్తున్నారు.

ఈ పెళ్లిలో అనేక రకాల భావోద్వేగాలు ప్రేమ ఆప్యాయతలు ఉంటాని ఈ పాటలో చక్కగా చూపించారు. నిన్న విడుదలైన ఈ పాటకు విశేష స్పందన లభిస్తోంది. ఈ పాటను సినీ రచయిత చంద్రబోస్ రాయగా... మిక్కీ జే మేయర్ సంగీతం అందించారు. ఛైత్ర అండిపూడి శ్రీకృష్ణ ఈ పాటను ఆలపించారు. స్క్రీన్ పై విజువల్స్ బాగుండడంతో పాటు పాట కూడా అదిరిపోయింది.

నందినీ రెడ్డి దర్శకత్వం వహించిన అన్నీ మంచి శకనాములే చిత్రంలో రాజేంద్ర ప్రసాద్ రావు రమేష్ నరేష్ గౌతమి సౌకార్ జానకి వాసుకి మరియు పలువురు ప్రముఖ నటీనటులు ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. దావూద్ స్క్రీన్ ప్లే అందించగా లక్ష్మీ భూపాల డైలాగ్ రైటర్. దివ్య విజయ్ ఎగ్జిక్యూటివ్ నిర్మాతగా వ్యవహరించారు.

ప్రొడక్షన్ డిజైనర్ గా శివమ్ రావు కాస్యూమ్ స్టైలిస్ట్ గా పల్లవి సింగ్ పీఆర్ఓగా వంశీ శేఖర్ వ్యవహరిస్తున్నారు. అయితే అన్నీ మంచి శకునములే.. ఈ సారి వేసవికి చల్లని చిరుగాలి అనే క్యాప్షన్ తో ఉన్న  ఈ చిత్రం మే 18వ తేదీన విడుదల కాబోతుంది. అందుకోసం చిత్రబృందం ఇప్పటికే అన్ని ఏర్పాట్లు చేసింది.