సెలబ్రిటీల్ని ఆకర్షిస్తున్న ఇంప్రెషన్ ఆర్ట్

Fri Nov 08 2019 21:45:14 GMT+0530 (IST)

Anila Impressions Attracting Celebrities

జీవితం ఒక్కటే. అదో అందమైన జర్నీ లాంటిది. అయితే ఈ జర్నీలో కొన్ని తీపి జ్ఞాపకాల్ని దాచుకోవడం అన్నది చాలా ముఖ్యం. పాత గుర్తుల్ని తిరగేస్తే ఎన్నో విషయాలు స్ఫురణకు వస్తాయి. అందులో ఆనందం దాగి ఉంటుంది. అందుకే ఇప్పుడు 'ఇంప్రెషన్ అండ్ ఫ్రేమ్ ఆర్ట్' అంతే పాపులరవుతోంది. టాలీవుడ్ సహా సౌత్ స్టార్స్ అంతా అనీలా ఇంప్రెషన్ ఆర్ట్ కి ఫేవరెట్స్. నిరంతరం ఈ హైదరాబాదీ ప్రతిభావని సెలబ్రిటీ ఇంప్రెషన్ ఆర్ట్ లో బిజీ బిజీ.అసలింతకీ ఈ ఆర్ట్ ప్రత్యేకత ఏమిటి? అంటే.. చిన్నారులైనా.. లేదా పెద్ద వాళ్లు అయినా వారికి సంబంధించిన స్మృతుల్ని కానుకగా ఇచ్చి సర్ ప్రైజ్ చేయడం అని అంటారు అనీలా. పసికందుగా ఉన్నప్పటి ఆ జ్ఞాపకాల్ని బంధించేదెలా? అందుకే ఆ చిన్నారి చిట్టి కాళ్లు.. చేతులకు సంబంధించిన గుర్తుల్ని అందంగా ముస్తాబు చేసి డిజైనర్ ఆర్ట్ గా రూపొందిస్తారట హైదరాబాదీ ఆర్టిస్ట్ అనీలా. ఇంతకుముందు సర్ ప్రైజ్ గిఫ్ట్ గా మాత్రమే భావించేవారు. కానీ గత కొంత కాలంగా తమ ఆత్మీయుల్ని కోల్పోయిన వారి కోసం అనీలా.. అమె టీమ్ వారికి సంబంధించిన జ్ఞాపకాల్ని చెబితే వాటిని అచ్చు అదే తరహాలో తయారు చేస్తూ సెలబ్రిటీలను ఆకట్టుకుంటున్నారు. హైదరాబాద్‌లో ప్రత్యేకంగా దీని కోసం అనీలా ఓ ఆఫీస్ ని రన్ చేస్తున్నారు. ఈమె దగ్గరికి వచ్చే క్లైంట్‌లు చాలా వరకు సెలబ్రిటీలే వుంటుండటం విశేషం. బొడ్డుతాడు.. బ్రెస్ట్ మిల్క్.. బూడిద సహాయంతో మెమరబుల్ థింగ్స్‌ని సిద్ధం చేయడంలో మంచి పేరుని సొంతం చేసుకున్నారు.

వీరి పనితనం నచ్చి నేచురల్ స్టార్ నాని తన తనయుడు అర్జున్ కు సంబంధించిన పాదం.. చేతిని ప్రింట్ నమూనాను తయారు చేయించుకున్నారు. నాని బాటలోనే ఎందరో సెలబ్రిటీలకు అనీలా ఈ తరహాలో ఇంప్రెషన్ ఆర్ట్ కానుకలు రెడీ చేసి ఇచ్చారు. రకుల్- తమన్నా- మంచు లక్ష్మీ- సుజీత- మంజుల వంటి తారలు తమ శరీరంలో తమకు నచ్చిన శరీర భాగానికి సంబంధించిన నకలును సిద్ధం చేసుకుని వెళ్లారు. వీరి తరహాలోనే బాలీవుడ్ క్రేజీ నటి సారా అలీఖాన్ కూడా తన కళ్లు లేదా చేతులకు సంబంధించిన నకలును సిద్ధం చేయించుకోవాలనే ఆలోచనలో వుందట. 'కెమికల్స్‌ని మిక్స్ చేసి తొలుత ప్రయత్నాలు చేశాను కానీ అవేవీ అంతగా ఫలితాల్ని అందించలేదు. అందుకే కొత్త పద్దతిని అనుకరించి మెమోరబుల్ థింగ్స్‌ని క్రియేట్ చేస్తున్నాం అని అనీలా చెబుతున్నారు. తన వృత్తి పట్ల ఎంతో సంతృప్తిగా ఉన్నారట.