అన్నీ`భోళా శంకర్` తరువాతే అంటున్నారు

Fri Jan 14 2022 19:22:17 GMT+0530 (India Standard Time)

Anil Sunkara About Bhola Shankar Movie

మెగా స్టార్ తో సినిమా చేయాలని ఎంతో మంది డైరెక్టర్ లు నిర్మాతలు ఆశగా ఎదురుచూస్తుంటారు. ఒక్క సినిమా అయినా ఆయనతో కలిసి పని చేసే అవకాశం కోసం ఎదురుచూస్తుంటారు. చిరు అంటే అంత క్రేజ్. అలాంటి చిరుతో సినిమా చేసే అవకాశం వస్తే... ఆ డైరెక్టర్ నిర్మాత తీసుకునే కేర్ అంతా ఇంతా కాదు. ఆ సినిమా పూర్తయ్యే వరకు అదే తమ ప్రపంచంగా భావిస్తూ దాని కోసమే శ్రమిస్తుంటారు. ఇప్పుడు ఇదే పరిస్థితిలో వున్నారు ఓ స్టార్ ప్రొడ్యూసర్.ఆయనే అనిల్ సుంకర. ఏకే ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై మహేష్ బాబుతో `సరిలేరు నీకెవ్వరు` వంటి బారీ చిత్రాన్ని తెరకెక్కించి సోలోగా భారీ లీగ్ లోకి ఎంట్రీ ఇచ్చిన అనిల్ సుంకర ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి హీరోగా `భోళా శంకర్` మూవీని నిర్మిస్తున్నారు. అజిత్ నటించిన తమిళ బ్లాక్ బస్టర్ `వేదాలం` ఆధారంగా ఈ మూవీని రీమేక్ చేస్తున్నారు. మెహర్ రమేష్ దర్శకత్వం వహిస్తున్నారు.

చిరుకు జోడీగా మిల్కీ బ్యూటీ తమన్నా హీరోయిన్ గా నటిస్తుండగా చిరుకు సోదరిగా కీర్తి సురేష్ కనిపించబోతోంది. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ దశలో వుంది. గత కొన్ని నెలలుగా ఏకే ఎంటర్ టైన్మెంట్స్ అధినేత అనిల్ సుంకర ఈ మూవీ పనుల్లోనే బిజీగా వున్నారు. మెగాస్టార్ మూవీ కావడంతో ఈ సినిమా తప్ప మరో సినిమా గురించి ఆలోచించడం లేదంట.

అన్ని `భోళా శంకర్` తరువాతే అని ఎవరు అడిగినా ఏకే ఎంటర్టైన్మెంట్స్ టీమ్ చెబుతున్నారట. ఫుల్ ఫోకస్చిరు మూవీపై పెట్టి ఎలాగైనా ఈ మూవీతో బ్లాక్ బస్టర్ హిట్ ని సొంతం చేసుకోవాలని భావిస్తున్నారట అనిల్ సుంకర. `సరి లేరు నీకెవ్వరు` మూవీతో బ్లాక్ బస్టర్ ని సోలో ప్రొడ్యూసర్ గా సొంతం చేసుకున్న ఆయన `భోళా శంకర్`తోనూ అంతకు మించిన హిట్ ని దక్కించుకోవాలని ఇండస్ట్రీ వర్గాలు అంటున్నాయి.