#NBK 107 ఎవరితో? గోపిచంద్ కంటే ముందే రావిపూడితో?

Fri Sep 24 2021 07:00:01 GMT+0530 (IST)

 Anil Ravipudi script oK to NBK107

ప్రస్తుతం నటసింహా నందమూరి బాలకృష్ణ స్పీడ్ పెంచిన సంగతి తెలిసిందే. బోయపాటి శ్రీను దర్శకత్వంలో `అఖండ`లో చిత్రీకరణ పూర్తవుతోంది. భారీ అంచనాల మధ్య ఈ హై ఆక్టేన్ యాక్షన్ ఎంటర్ టైనర్ విడుదల కానుంది. `సింహ`..`లెజెండ్` తర్వాత అదే కాంబినేషన్ లో వస్తోన్న చిత్రం కావడంతో అసాధారణమైన అంచనాలు నెలకొన్నాయి. ఈ కలయికలో హ్యాట్రిక్ ఖాయమనే అభిమానులు భావిస్తున్నారు. ఇప్పటికే బాలయ్య వెర్సటైల్ లుక్ ఆద్యంతం ఆకట్టుకుంటోంది. ప్రచారం చిత్రాలు ఎక్స్ పెక్టేషన్స్ ని అంతకంతకు పెంచేస్తున్నాయి. ఇటీవలే చిత్రీకరణ పూర్తి చేసుకున్న సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో నిమగ్నమైంది. అన్ని పనులు పూర్తిచేసి వీలైనంత త్వరగా ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని సన్నాహాలు చేస్తున్నారు.అయితే బాలయ్య మాత్రం `అఖండ` రిలీజ్ తో సంబంధం లేకుండా కొత్త ప్రాజెక్ట్ ల్ని పట్టాలెక్కించే పనిలో పడ్డట్లు తెలుస్తోంది. ఇప్పటికే గోపిచంద్ మలినేనితో సినిమా ప్రీప్రొడక్షన్ పనుల్లో ఉంది. అలాగే యంగ్ డైరెక్టర్ అనీల్ రావిపూడితో ఓ చిత్రాన్ని కమిట్ అయిన సంగతి తెలిసిందే. ముందుగా ఈ చిత్రాన్ని పట్టాలెక్కించే ప్లాన్ లో ఉన్నారుట. అనీల్ కున్న సక్సెస్ రేట్ నేపథ్యంలో యంగ్ డైరెక్టర్ తోనే సెట్స్ కెళ్లాలని భావిస్తునట్లు తెలుస్తోంది. ఈ చిత్రం అనంతరం మాస్ డైరెక్టర్ గోపీచంద్ మలినేనితో సినిమా చేయనున్నారుట. ఇప్పటికే స్క్రిప్ట్ లాక్ అయింది. బాలయ్య మాస్ అభిమానుల అంచనాలకు ఎంత మాత్రం తగ్గకుండా ఉంటుందని సమాచారం. చూస్తుంటే ఎన్.బి.కే 107 కోసం గోపిచంద్ మలినేని.. అనీల్ రావిపూడి పోటీపడ్డారని అర్థమవుతోంది. ముందుగా అనీల్ రావిపూడి స్క్రిప్టుకే ఓకే చెప్పేందుకు ఆస్కారం ఉందన్న గుసగుసా ఇప్పుడు వేడెక్కిస్తోంది.

అలాగే ఈ చిత్రంతో పాటే డ్యాషిండ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ చిత్రాన్ని కూడా సెట్స్ పైకి తీసుకెళ్లాలన్ని ప్లాన్ చేస్తున్నారు. `పైసా వసూల్` సమయంలో పూరి తన అభిమాన దర్శకుడు అని తనతో మరో సినిమా చేస్తానని బాలయ్య కీర్తించారు. బాలయ్య ఔన్నత్యాన్ని పూరి అదే రేంజ్ లో ప్రచార వేదికపైనా చెప్పారు. ఈ నేపథ్యంలో పూరిని ఇక ఎంత మాత్రం వెయిట్ చేయించకూడదని భావిస్తున్న బాలయ్య తన చిత్రాన్ని మొదలు పెట్టేయాలని భావిస్తున్నారుట. ఇప్పటికే బాలయ్య కోసం పూరి అదిరిపోయే స్క్రిప్ట్ రెడీ చేసినట్లు మీడియా కథనాలు వేడెక్కిస్తోన్న సంగతి తెలిసిందే.

ఇంకా ఎక్కడా తగ్గని క్రాక్ డైరెక్టర్

ఓవైపు రేస్ లో అనీల్ రావిపూడి .. పూరి జగన్నాథ్ లాంటి టాప్ డైరెక్టర్లు రేసులో ఉన్నా కానీ.. గోపిచంద్ మలినేని ఏ విషయంలోనూ తగ్గడం లేదు. గోపిచంద్ మలినేని నందమూరి కాంపౌండ్ లో అడుగుపెడుతున్నారు. నటసింహం నందమూరి బాలకృష్ణకు కథ చెప్పి ఒప్పించి ప్రస్తుతం ప్రీప్రొడక్షన్ పనులు చేస్తున్నారు. అతడు బాలయ్యను పవర్ ఫుల్ పాత్రలో చూపించనున్నారు. నటసింహాన్ని ఈసారి సరికొత్తగా ఆవిష్కరించేందుకు గోపిచంద్ మలినేని సన్నాహకాల్లో ఉన్నారట. బాలయ్య నుంచి `రౌడీయిజం`ని బయటకు తీస్తారని కూడా గుసగుసలు వినిపిస్తున్నాయి. రౌడీ రాంబాబు తరహా కాన్సెప్ట్ కాబట్టి `రౌడీయిజం`ని టైటిల్ గా అనుకుంటున్నారని కథనాలొచ్చాయి. ఇందులో బాలయ్యబాబుని మూడు విభిన్నమైన గెటప్పుల్లో చూపిస్తారని కూడా టాక్ బయటకు వచ్చింది.
ఇందులో మాస్ ఎలిమెంట్స్ కి కానీ హై ఆక్టేన్ యాక్షన్ సీక్వెన్స్ కి కానీ బోలెడంత స్కోప్ ఉండనుందని తాజా లీకులు వెల్లడిస్తున్నాయి.

మైత్రి మూవీ మేకర్స్ అత్యంత భారీ బడ్జెట్ తో ఈ చిత్రాన్ని నిర్మించనుంది. తమన్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తారు. అందాల త్రిష ఈ చిత్రంతో హీరోయిన్ గా తిరిగి టాలీవుడ్ లో అడుగుపెట్టనుందని కూడా కథనాలొచ్చాయి. ఇలియానా కానీ త్రిష కానీ ఈ చిత్రంలో నటిస్తారని కథనాలొస్తున్నాయి.