Begin typing your search above and press return to search.

శివ‌రాత్రికి అనిల్ రావిపూడి ‘చిత్రం’!

By:  Tupaki Desk   |   24 Jan 2021 8:20 AM GMT
శివ‌రాత్రికి అనిల్ రావిపూడి ‘చిత్రం’!
X
మీరు చ‌దివింది క‌రక్టే! అనిల్ రావిపూడి చిత్రం శివ‌రాత్రి సంద‌ర్భంగా వ‌చ్చేస్తోంది! అదేంటీ.. ఎఫ్‌-3 మొద‌లు పెట్టి కొన్ని రోజులు కూడా కాలేదు. అప్పుడే ఎలా అనుకుంటున్నారా? అయితే.. రాబోతున్న‌ది ఎఫ్‌-3 కాదు.. ఆయ‌న ప‌ర్య‌వేక్ష‌ణ‌లో తెర‌కెక్కిన ‘గాలి సంప‌త్‌’ అనే సినిమా.

కొన్ని రోజుల క్రితం ఈ వార్తతో అంద‌రినీ స‌ర్ఫ్రైజ్ చేశాడు అనిల్‌. ‘గాలి సంపత్’ దర్శకత్వ విభాగాన్ని తాను పర్యవేక్షిస్తున్నట్లు గ‌తంలో ప్ర‌క‌టించాడు ఈ సూపర్ సక్సెస్‌ఫుల్ డైరెక్టర్. ఈ సినిమాను త్వ‌ర‌లో రిలీజ్ చేయ‌బోతున్న‌ట్టు చిత్ర యూనిట్ ప్ర‌క‌టించింది.

అనిల్ కెరీర్‌లో 100 శాతం సక్సెస్ రేటు ఉంది. ఆయ‌న తెర‌కెక్కించిన సినిమాల‌న్నీ ప్రేక్ష‌కుల‌ను ఆక‌ట్టుకున్నాయి. అలాంటి డైరెక్ట‌ర్ ప‌ర్య‌వేక్ష‌ణ‌లో సినిమా తెర‌కెక్కిందంటే.. ఆడియ‌న్స్ లో ఒక విధ‌మైన అటెన్ష‌న్ త‌ప్ప‌నిస‌రిగా ఉంటుంది. ఈ విష‌యం ఖచ్చితంగా ‘గాలి సంపత్’కు అసెట్ అన‌డంలో అతిశ‌యోక్తి లేదు.

కాగా.. ఈ చిత్రాన్ని ఈ మహా శివరాత్రికి రిలీజ్ చేస్తున్న‌ట్టు మేక‌ర్స్ ప్ర‌క‌టించారు. మార్చి 11వ తేదీన బాక్సాఫీస్ పోరులో త‌మ చిత్రాన్ని నిల‌ప‌బోతున్న‌ట్టు చెప్పారు. శ్రీ విష్ణు, రాజేంద్ర ప్రసాద్ ప్రధాన పాత్రల్లో న‌టిస్తున్న ఈ చిత్రాన్ని ఇమేజెస్ పార్క్ ఎంటర్టైన్మెంట్, ఎస్ షైన్ స్క్రీన్స్ ఆధ్వర్యంలో ఎస్ కృష్ణ నిర్మిస్తున్నారు. అచు సంగీతం అందిస్తున్నారు.