Begin typing your search above and press return to search.

అలరిస్తోన్న 'అందాల రాశి' ప్రోమో..!

By:  Tupaki Desk   |   28 May 2022 6:48 AM GMT
అలరిస్తోన్న అందాల రాశి ప్రోమో..!
X
మాచో స్టార్ గోపీచంద్ హీరోగా ఎంటర్టైన్మెంట్ సినిమాల స్పెసిలిస్ట్ మారుతి దర్శకత్వంలో తెరకెక్కుతోన్న తాజా చిత్రం ''పక్కా కమర్షియల్''. అల్లు అరవింద్ సమర్పణలో రూపొందుతున్న ఈ కోర్టు డ్రామాలో బబ్లీ బ్యూటీ రాశీఖన్నా హీరోయిన్ గా నటిస్తోంది.

'పక్కా కమర్షియల్' చిత్రాన్ని 2022 జూలై 1న ప్రపంచ వ్యాప్తంగా థియేటర్లలో విడుదల చేయనున్నారు. ఈ నేపథ్యంలో మేకర్స్ ప్రచార కార్యక్రమాలను వేగవంతం చేస్తున్నారు. ఇందులో భాగంగా 'అందాల రాశీ' అనే గీతాన్ని జూన్ 1న రిలీజ్ చేయనున్నారు.

అయితే అంతకంటే ముందు తాజాగా ఈ సాంగ్ ప్రోమోని చిత్ర బృందం సోషల్ మీడియా వేదికగా విడుదల చేసింది. 'అందాల రాశీ మేకప్ వేసి.. నాకోసం వచ్చేనే.. స్వర్గంలో కేసే నామీద వేసి భూమ్మీద మూసావే..' అంటూ సాగిన ఈ ప్రోమో ఆకట్టుకుంటోంది.

కోర్టు బ్యాక్ డ్రాప్ కు తగ్గట్టుగా ప్రత్యేకమైన థీమ్ తో భారీ సెట్ లో 'అందాల రాశీ' పాటను చిత్రీకరించారు. ఇందులో గోపీచంద్ - రాశీ ఖన్నా జంట కలర్ ఫుల్ డ్రెస్సులో స్టైలిష్ గా మరియు అందంగా ఉన్నారు. ట్యూన్ కు తగ్గట్టుగా ఉన్న గ్రాండ్ విజువల్

జేక్స్ బిజోయ్ స్వరాలు సమకూర్చిన ఈ గీతానికి కె.కె సాహిత్యం అందించారు. సాయి చరణ్ భాస్కరుని - రమ్య బెహర కలిసి ఆలపించారు. 'అందాల రాశీ' పూర్తి పాట లిరికల్ వీడియోని జూన్ 1 సాయంత్రం 4.05 గంటలకు రిలీజ్ చేయనున్నారు.

ఇప్పటికే విడుదలైన 'పక్కా కమర్షియల్' సినిమాకు సంబంధించిన ఫస్ట్ గ్లిమ్స్ - టీజర్ వంటి ప్రమోషనల్ కంటెంట్ మంచి రెస్పాన్స్ తెచ్చుకుంది. దివంగత గేయ రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి రాసిన టైటిల్ సాంగ్ శ్రీతలను విశేషంగా ఆకట్టుకుంది. ఈ క్రమంలో రాబోతున్న సెకండ్ సింగిల్ కు ఆడియన్స్ నుంచి ఎలాంటి స్పందన వస్తుందో చూడాలి.

టైటిల్ కు తగ్గట్టుగానే పక్కా కమర్షియల్ హంగులతో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. జీఏ2 పిక్చర్స్ మరియు యూవీ క్రియేషన్స్ పతాకాలపై బన్నీ వాసు ఈ సినిమాని నిర్మిస్తున్నారు. SKN సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. రవీందర్ ఆర్ట్ డైరెక్టర్ గా వర్క్ చేయగా.. కరమ్ చావ్లా సినిమాటోగ్రఫీ అందించారు.