Begin typing your search above and press return to search.

బిగ్ బాస్‌ : యాంకర్‌ రవి రీ ఎంట్రీ నిజమెంత?

By:  Tupaki Desk   |   4 Dec 2021 6:31 AM GMT
బిగ్ బాస్‌ : యాంకర్‌ రవి రీ ఎంట్రీ నిజమెంత?
X
తెలుగు బిగ్‌ బాస్ సీజన్ 5 ముగింపు దశకు వచ్చింది. గత వారం అనూహ్యంగా యాంకర్‌ రవి ఎలిమినేట్‌ అయిన విషయం తెల్సిందే. రవి ఎలిమినేషన్ ను అన్‌ ఫెయిర్ అంటూ అభిమానులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సోషల్‌ మీడియాలో స్టార్‌ మా మరియు బిగ్‌ బాస్ నిర్వాహకులను తీవ్ర స్థాయిలో విమర్శిస్తూ యాంకర్‌ రవి ఎలిమినేషన్ ను తప్పుబడుతున్నారు.

అన్న పూర్ణ స్టూడియో ముందు ఏకంగా ధర్న కూడా చేయడం జరిగింది. ఇంత రచ్చ జరుగుతున్న నేపథ్యంలో తప్పని సరి పరిస్థితుల్లో యాంకర్ రవిని రీ ఎంట్రీ ఇప్పిస్తున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. స్టార్‌ మా వారు ఇప్పటికే ఆ విషయమై రవికి సమాచారం ఇవ్వడం జరిగింది.. ఒకటి రెండు రోజుల్లో ఆయన వెళ్లడం జరుగుతుంది అంటూ సోషల్‌ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది.

ఈ ప్రచారం నూటికి నూరు పాళ్లు అబద్దం. అస్సలు అలాంటి ఛాన్స్ లేనే లేదు. మరో రెండు వారాల్లో సీజన్ ముగియబోతుంది. ఇలాంటి సమయంలో రీ ఎంట్రీ ఇవ్వడం అనేది అస్సలు ఉండదు. అది అసలు గేమ్‌ ఎలా అవుతుంది. యాంకర్ రవి కుటుంబంతో కలిసి హాలీడేకు వెళ్తున్నాడు.

ఫినాలే ఎపిసోడ్‌ కు ఒకటి రెండు రోజుల ముందు తిరిగి ఆయన హైదరాబాద్‌ చేరుకబోతున్నాడు. ఫినాలే ఎపిసోడ్ వరకు యాంకర్ రవి కనిపించబోడు. యాంకర్‌ రవి బిగ్‌ బాస్ ఎంట్రీ అనేది జరగని విషయం. గతంలో అలాంటివి జరిగాయి... కాని అప్పటి పరిస్థిలులు వేరు. ఇలా చివరి రెండు వారల్లో ఏ సీజన్ లో కాని.. ఏ భాషలో కాని వైల్డ్‌ కార్డ్‌ ఎంట్రీ లేదా రీ ఎంట్రీ ఉండనే ఉండదు అనడంలో సందేహం లేదు.

ఇక బిగ్‌ బాస్ ఈ సీజన్ విషయానికి వస్తే టికెట్‌ టు ఫినాలే టాస్క్ ల్లో శ్రీరామ చంద్ర విజయం సాధించాడు. మరో వారం రోజుల సమయం ఉండగానే ఫినాలే ఎపిసోడ్‌ కు ఎంపిక అయ్యాడు. ఈ వారంలో ఎవరు ఎలిమినేట్‌ అవ్వబోతున్నారు అనేది చూడాలి. బిగ్ బాస్ సీజన్‌ 5 ఫినాలే ఎపిసోడ్ కు సంబంధించి ఇప్పటికే ఏర్పాట్లు జరుగుతున్నాయి.

టాప్‌ 5 లో ఉండే వారి పై ఊహాగాణాలు తీవ్ర స్థాయిలో వస్తున్నాయి. చాలా మంది సన్నీ.. షన్నూ మరియు శ్రీరామ్ లు టాప్ 3 లో ఉంటారని అంటున్నారు. ఇదే సమయంలో శ్రీరామ చంద్ర అనారోగ్యంతో బయటకు వచ్చే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి అంటూ కొందరు కామెంట్స్ చేస్తున్నారు. ఆ విషయమై క్లారిటీ రావాల్సి ఉంది.