Begin typing your search above and press return to search.

యాంకర్‌ రవికి ప్రాణహాని ఉందట

By:  Tupaki Desk   |   10 Feb 2020 5:22 AM GMT
యాంకర్‌ రవికి ప్రాణహాని ఉందట
X
బుల్లి తెరపై యాంకర్‌ గా పలు షోల్లో కనిపిస్తూ తన బోల్డ్‌ పంచ్‌ లతో ప్రేక్షకులను నవ్విస్తూ ఉండే యాంకర్‌ రవి తాజాగా కూకట్‌ పల్లి పోలీస్‌ స్టేషన్‌ లో ఫిర్యాదు నమోదు చేశాడు. తన వద్ద సందీప్‌ అనే వ్యక్తి ఒక సినిమా డిస్ట్రిబ్యూషన్‌ కోసం 45 లక్షల రూపాయలు అప్పుగా తీసుకున్నాడు. ఆ అప్పు తీర్చకుండా ఇబ్బంది పెడుతున్నాడు. డబ్బు అడుగుతుంటే కొంత మందితో బెదిరిస్తున్నాడు. నేను ఎక్కడ షూటింగ్‌ లో ఉన్నా కూడా వారు వచ్చి నన్ను బెదిరిస్తున్నారు అంటూ ప్రదీప్‌ పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నాడు.

సందీప్‌ మనుషుల వల్ల నాకు ప్రాణహాని ఉందని.. వారి నుండి నన్ను రక్షించండి అంటూ రవి పోలీసులను కోరాడు. సందీప్‌ నా వద్దే కాకుండా ఇంకా చాలా మంది వద్ద డబ్బులు అప్పుగా తీసుకుని ఇప్పుడు చెల్లించకుండా బెదిరిస్తున్నాడు. అతడి బెదిరింపులతో చాలా మంది భయపడి పోతున్నారంటూ రవి పేర్కొన్నాడు. రవి ఇచ్చిన ఫిర్యాదు తో కేసు నమోదు చేసిన కూకట్‌ పల్లి పోలీసులు విచారణ మొదలు పెడతామంటూ హామీ ఇచ్చారట.

బుల్లి తెర మరియు సోషల్‌ మీడియాలో చాలా ఫేమస్‌ అయిన యాంకర్‌ రవి పోలీసుల ముందుకు వెళ్లడం తో ప్రస్తుతం ఆ వార్త కాస్త వైరల్‌ అవుతుంది. బుల్లి తెర వర్గాల్లో ఈ విషయమై చర్చ జరుగుతుంది. యాంకర్‌ రవి ఫిర్యాదు పై ఆ సందీప్‌ ఎలా స్పందిస్తాడు అనేది చూడాలి.