కాస్ట్ లీ బెంజ్ తో యాంకరమ్మ తళుకులు

Tue Oct 08 2019 19:13:16 GMT+0530 (IST)

Anchor Manjusha Buys Benz Car

టాలీవుడ్ లో టాప్ క్లాస్ యాంకర్ల పేర్లు చెప్పమంటే పట్టుమని అరడజను కూడా చెప్పలేం. సుమ-ఝాన్సీ-ఉదయభాను-అనసూయ-రేష్మి-శ్రీముఖి .. అంటూ ఆపేస్తాం. ఆ తర్వాత జనరేషన్ లో అంతగా చెప్పుకునే పేర్లేవీ లేవు. సరిగ్గా ఇదే పాయింట్ ని తనదైన తెలివితేటలు.. ట్యాలెంట్ తో క్యాష్ చేసుకోవడంలో బిగ్ సక్సెస్ అయ్యింది యాంకర్ మంజూష.టాలీవుడ్ లో ఏ ఈవెంట్ జరిగినా అక్కడ ఈ అందాల యాంకర్ ప్రత్యక్షమవుతోంది. ప్రీరిలీజ్ లు.. ఆడియో వేడుకలు.. అవార్డ్ ఫంక్షన్స్.. చిన్నా చితకా సినిమాలకు ప్రమోషన్స్ లో.. ఈటీవీ-జెమినీ-మా అనే తేడా లేకుండా అన్ని టీవీ చానెళ్లకు ఫ్రీల్యాన్సర్ గా పని చేస్తూ పది చేతులా ఆర్జిస్తోంది. నెలకు లక్షల్లో ఆదాయం ఈ యాంకరమ్మకు దక్కుతోంది. అందుకేగా ఇదిగో ఈ దసరా తన ఇంటికి సరికొత్త కాంతుల్ని తెచ్చింది.

ఎవ్వర్ లేటెస్ట్ బెంజ్ సెడాన్ రేంజ్ కార్ తన ఇంటికే ఎగురుకుంటూ వచ్చింది. టాలీవుడ్ లోనే ఖరీదైన కార్ ని కొనుక్కున్న యాంకరమ్మగా మంజూష పేరు మార్మోగుతోంది. పరిశ్రమకు వచ్చి 30 ఇయర్స్ ఇండస్ట్రీ అని చెప్పుకునే చాలామందికి కేవలం పదేళ్లలోనే కళ్లు తెరిపించిన గ్రేట్ యాంకరమ్మ మంజూష. ఝాన్సీ-సుమ-అనసూయ వీళ్లంతా ఆ రేంజ్ లో కాస్ట్ లీ కార్లలో హల్ చల్ చేస్తుంటారు. ఆ వరసలో చాలా తక్కువ కాలంలోనే పాపులరైన యాంకర్ మంజూష అని చెప్పాలి. ప్రస్తుతం మంజూషకు కథానాయికగానూ ఆఫర్లు వెల్లువెత్తుతున్నాయన్న సమాచారం ఉంది.