జబర్దస్త్ లో చాలా అవమానించారు

Mon Aug 15 2022 08:00:01 GMT+0530 (India Standard Time)

Anchor Anasuya On Leaving Jabardasth

ఈటీవీలో జబర్దస్త్ ప్రారంభం అయ్యి దాదాపుగా పది సంవత్సరాలు అవుతోంది. షో ప్రారంభం అయిన సమయంలో అనసూయ ను యాంకర్ గా తీసుకున్న విషయం తెల్సిందే. ఆ సమయంలో షో కు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. షో కు మంచి రేటింగ్ వచ్చి ప్రేక్షకుల ఆదరణ దక్కించుకున్న సమయంలో అనూహ్యంగా కొన్ని వ్యక్తిగత కారణాల వల్ల జబర్దస్త్ నుండి అనసూయ దూరం అయ్యింది.



మళ్లీ కొంత కాలానికే అనసూయ జబర్దస్త్ లో రీ ఎంట్రీ ఇచ్చింది. అప్పటి నుండి మళ్లీ ఇప్పటి వరకు జబర్దస్త్ అనసూయ గా తెలుగు బుల్లి తెర మరియు వెండి తెరపై తనదైన ముద్రను వేయడం లో సఫలం అయ్యింది. నటిగా వరుసగా సినిమాలు చేస్తున్న సమయంలో జబర్దస్త్ కు అనసూయ దూరం అవ్వబోతున్నట్లుగా వార్తలు వచ్చాయి. ఆ వార్తలు నిజమే అన్నట్లుగా జబర్దస్త్ కు అనసూయ దూరం అయ్యింది.

షో కు దూరం అవుతున్న సమయంలో తాను సినిమా లపై ఎక్కువగా దృష్టి పెట్టాలని భావిస్తున్నట్లుగా చెప్పుకొచ్చింది. కాని తాజాగా ఒక ఇంటర్వ్యూలో మాత్రం ఈమె స్పందిస్తూ జబర్దస్త్ లో తాను చాలా అవమానాలను ఎదుర్కోవల్సి వచ్చింది. కామెడీ పేరుతో నన్ను చాలా మంది చాలా రకాలుగా కామెంట్స్ చేస్తున్నా కూడా ఈ ఫీల్డ్ లో తప్పదు అన్నట్లుగా సర్ది చెప్పుకుంటూ వచ్చాను.

బాడీ షేమింగ్ మొదలుకుని వెకిలి చేష్టలు నాకు నచ్చవు. ఎవరైనా నాపై పంచ్ లు వేసిన సమయంలో నేను సీరియస్ అవుతాను. కాని వాటిని టెలికాస్ట్ చేయలేదు. చాలా సార్లు నా పై పంచ్ లు వేయవద్దని అన్నాను. అయినా కూడా చాలా మంది జబర్దస్త్ కమెడియన్స్ ఇష్టానుసారంగా పంచ్ లు వేయడంతో పాటు ఎవరికి తోచిన విధంగా వారు కామెంట్స్ చేసేవారు అంది.

నాగ బాబు మరియు రోజా వెళ్లడం వల్లే అనసూయ కూడా వెళ్లి పోయింది అంటూ వస్తున్న వార్తలపై ఆమె స్పందిస్తూ.. నాగ బాబు గారు.. రోజా గారు వెళ్లి పోవడం వల్లే తాను వెళ్లి పోయాను అంటూ మాట్లాడటం అవివేకం. వారు వెళ్లి పోతే నేను వెళ్లి పోవడంకు నేను ఏమైనా గొర్రెల మంద కు చెందిన దాన్నా.. నేను వారిని ఎందుకు ఫాలో అవుతాను అన్నట్లుగా అనసూయ చెప్పుకొచ్చింది. మొత్తానికి జబర్దస్త్ వల్ల చాలా బాధ పడ్డాను అని.. చాలా అవమానింపబడ్డాను అంటూ అనసూయ చెప్పుకొచ్చింది.