Begin typing your search above and press return to search.

పిక్ టాక్: అనసూయ మరో బికినీ కిక్

By:  Tupaki Desk   |   6 Jun 2023 3:07 PM GMT
పిక్ టాక్: అనసూయ మరో బికినీ కిక్
X
టాలీవుడ్ హాట్ యాంకర్ ఎవరు అనగానే ముందుగా వినిపించేది అనసూయ పేరు. యాంకరింగ్ కి గ్లామర్ హద్దులు అద్దింది అనసూయ అనే చెప్పొచ్చు. జబర్దస్త్ షోకి మొదట యాంకర్ గా అడుగుపెట్టి ఇప్పుడు సినిమా అవకాశాలు అందిపుచ్చుకొని దూసుకుపోతోంది. స్టార్ హీరోల సినిమాల్లోనూ కీలక పాత్రలు పోషిస్తోంది.

అనసూయ సోషల్ మీడియాలో చాలా చురుకుగా ఉంటుంది. తన ఫోటోలను ఎప్పటికప్పుడు షేర్ చేస్తూ ఉంటుంది. తన ఫోటోలకు నెగిటివ్ కామెంట్స్ చేసే వారికి కూడా అనసూయ స్ట్రాంగ్ గా రిప్లే ఇస్తూ ఉంటుంది. అంతేకాకుండా తనకు నచ్చినవి, నచ్చన విషయాలను కూడా ఆమె సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఉంటుంది. వాటి వల్ల ఆమె వివాదాల్లో ఇరుక్కున్న సందర్భాలు కూడా చాలా ఉన్నాయి.

కాగా, అనసూయ ఎంత వర్క్ లో బిజీగా ఉన్నా, ఫ్యామిలీ కి కూడా ఎక్కువ సమయం ఇస్తూ ఉంటారు. తన కుటుంబంతో కలిసి వెకేషన్ కి వెళ్తూ ఉంటుంది. ఇటీవల కూడా ఆమె వెకేషన్ కి వెళ్లగా, గ్యాప్ లేకుండా ఆ వెకేషన్ ఫోటోలు షేర్ చేస్తూ ఉంది. మొన్నటికి మొన్న బ్లాక్ బికినీలో, భర్త, కొడుకులతో కలిసి స్విమ్మింగ్ పూల్ లో ఎంజాయ్ చేస్తున్న ఫోటోలు షేర్ చేసింది. ఆ తర్వాత వెట్ కలర్ బికినీలోనూ మెరిసింది.

ఆ సమయంలో భర్త కు లిప్ లాక్ ఇచ్చిన ఫోటోలను కూడా షేర్ చేసింది. తాజాగా ఫ్లోరల్ బికినీలో మెరిసింది. ఈ బికినీలో ఆమె తన బ్యాక్ అందాలను మొత్తం చూపించేసింది. ఆ ఫోటోకి క్యాప్షన్ గా నేను నిన్ను చూస్తున్నాను. నువ్వు నన్ను చూస్తున్నావ్ అంటూ కామెంట్స్ చేసింది. ఈ బోల్డ్ పిక్స్ కి ఇప్పుడు ఆమె ఫ్యాన్స్ ని విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి. క్లియర్ గా బికినీలో ఫోటోలు షేర్ చేమయని కొందరు కామెంట్స్ చేస్తుంటే, మరీ ఇంత అవసరమా అని మరికొందరు కామెంట్స్ చేస్తున్నారు.

అయితే, తనను ఎవరు ఎంత విమర్శించినా ఆమె మాత్రం తనకు నచ్చినట్లుగా ఉంటున్నారు. ప్రస్తుతం అనసూయ పుష్ప2 లో నటిస్తున్నారు. ఆమె నటించిన విమానం సినిమా కూడా ప్రేక్షకుల ముందుకు రావడానికి రెడీ అయ్యింది