జబర్దస్త్ కు గుడ్ బై చెప్పిన అనసూయ..!

Wed Jun 29 2022 16:00:45 GMT+0530 (IST)

Anasuya says goodbye to Jabardast ..!

బుల్లితెరకు గ్లామర్ అద్దిన యాంకర్లలో అనసూయ భరద్వాజ్ ఒకరు. కెరీర్ ప్రారంభంలో సాక్షి టీవీ - మా టీవీలలో వర్క్ చేసిన అనసూయ.. 'జబర్దస్త్' కామెడీ షోలో ఫుల్ పాపులారిటీ తెచ్చుకుంది. ఓవైపు హోస్టింగ్ చేస్తూనే మరోవైపు పొట్టిపొట్టి దుస్తుల్లో గ్లామర్ ట్రీట్ అందిస్తుంది. కమెడియన్స్ హాస్యాన్ని పండిస్తూ తమ నవ్వులు పూయిస్తుంటే.. అనసూయ తన అందచందాలతో అందరినీ ఆకట్టుకుంటూ వచ్చింది.చాలా కాలంగా అనసూయ జబర్దస్త్ యాంకర్ గా కొనసాగుతోంది. రష్మీ బీగౌతమ్ నుంచి పోటీ ఎదురైనా తన స్థానాన్ని సుస్థిరం చేసుకుంది. సినిమా ఆఫర్స్ వచ్చినా తనకు గుర్తింపు తెచ్చిపెట్టిన కామెడీ షోని మాత్రం వదులుకోలేదు అనసూయ. అయితే ఇప్పుడు సడన్ గా షాకింగ్ డెసిషన్ తీసుకొంది. 'జబర్దస్త్' షోని వదిలేయాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది.

ఇటీవల కాలంలో 'జబర్దస్త్' మరియు 'ఎక్స్ట్రా జబర్దస్త్' నుంచి ఒక్కొక్కరుగా దూరం అవుతున్నారు. నాగబాబు మొదలుకొని.. సుడిగాలి సుధీర్ - గెటప్ శీను - కిర్రాక్ ఆర్పీ - అప్పారావు వంటి వారు ఇప్పటికే జబర్దస్త్ ని వీడారు. ఈ జాబితాలో అనసూయ కూడా చేరినట్లు ఆమె ఇన్స్టాగ్రామ్ స్టోరీని బట్టి అర్థం అవుతోంది.

"నా కెరీర్ లో నేను చాలా పెద్ద నిర్ణయం తీసుకున్నా. చాలా జ్ఞాపకాలను నాతో తీసుకువెళుతున్నా. అందులో ఎక్కువగా గుడ్ మెమొరీస్ ఉన్నాయి.. కొన్ని బ్యాడ్ వి కూడా ఉన్నాయి. ఎప్పటిలాగే మీ ఆదరణ నాకు ఉంటుందని భావిస్తున్నాను" అని అనసూయ ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేసింది.

అనసూయ జబర్దస్త్ పేరు ప్రస్తావించనప్పటికీ.. పరోక్షంగా ఆ షో నుంచి వెళ్లిపోతున్నట్లు చెబుతోందని నెటిజన్లు భావిస్తున్నారు. స్టార్ మా - జీ తెలుగు ఛానల్స్ లో పలు షోలకు కమిట్ అవ్వడం.. అలానే వరుసగా సినిమా ఆఫర్స్ వస్తుందటంతో అనసూయ ఇలాంటి నిర్ణయం తీసుకుందని అంటున్నారు.

ముఖ్యంగా సినీ కెరీర్ పై ఫోకస్ చేయాలనే ఉద్దేశంతోనే అనసూయ 'జబర్దస్త్' నుంచి బయటకు వస్తున్నట్లు చెప్పుకుంటున్నారు. అయితే ఈ విషయాన్ని ఆమె తన ఇన్స్టాగ్రామ్ లో ఎందుకు నేరుగా ప్రస్తావించలేదని కూడా కొందరు ఆలోచిస్తున్నారు.

'క్షణం' 'ఎఫ్ 2' 'సోగ్గాడే చిన్నినాయనా' 'మీకు మాత్రమే చెప్తా' 'రంగస్థలం' 'పుష్ప' వంటి సినిమాలు అనసూయ కు మంచి పేరు తెచ్చిపెట్టాయి. ఆమె నటించిన 'పక్కా కమర్షియల్' మూవీ రిలీజ్ కు రెడీ అయింది. రానున్న రోజుల్లో 'రంగమార్తాండ' 'పుష్ప: ది రూల్' వంటి సినిమాలతో ప్రేక్షకులను పలకరించబోతోంది.