ఫోటో స్టోరి: ఏముందమ్మా రంగమ్మత్త

Sat Dec 14 2019 13:29:43 GMT+0530 (IST)

Anasuya Latest Photoshoot

జబర్ధస్త్ యాంకర్ అనసూయ ఇస్పీడ్ గురించి చెప్పాల్సిన పనే లేదు. ఈ దశాబ్ధపు హాటెస్ట్ తెలుగు యాంకర్ అవార్డ్ తనకి ఇస్తే తప్పేమీ లేదు. ప్రస్తుతం ఉన్న టాప్ 5 యాంకర్లలో తన స్థానాన్ని పదిలం చేసుకున్న ఈ భామ... సీనియర్ యాంకర్లు సుమ- ఝాన్సీ-ఉదయభాను.. వీళ్ల తరం తర్వాత లాంగ్ స్టాండింగ్ ని కొనసాగిస్తోంది. ఇక ఇప్పటి యాంకర్లలోనే హాటెస్ట్ యాంకర్ గానూ యూత్ గుర్తించి అభిమానిస్తుంది. అందుకే అనసూయ సినిమా కెరీర్ పైనా సీరియస్ గానే ఫోకస్ చేస్తోందని అర్థమవుతోందిప్రస్తుతం బుల్లితెరతో పాటు వెండితెరను ఏలేందుకు తనదైన ప్లాన్స్ తో దూసుకు పోతోంది. ఇంతకుముందు సోగ్గాడే చిన్ని నాయనా.. యాత్ర .. ఎన్టీఆర్ బయోపిక్ ఇవన్నీ తనకు అంతో ఇంతో మైలేజ్ ని ఇచ్చాయి. కథనం చిత్రంలో నటిగా ఆకట్టుకుంది. వీటన్నిటినీ మించి రంగస్థలం రంగమ్మత్తగా తనకు దక్కిన పాపులారిటీ కెరీర్ కి పెద్ద ప్లస్ అవుతోంది. తెలివైన ఎంపికలతో అనసూయ పెద్ద తెర కెరీర్ ని సాఫీగా సాగిస్తోంది. ఓవైపు జబర్ధస్త్.. మరోవైపు జీటీవీ రియాలిటీ కార్యక్రమాలు.. ఇంకోవైపు సినిమాలు.. అసలు క్షణం తీరిక అన్నదే లేకుండా కెరీర్ జర్నీని సాగిస్తోంది.

ఇదంతా ఒకెత్తు అనుకుంటే రెగ్యులర్ ఫోటోషూట్లు ఇంకో ఎత్తు. లేటెస్టుగా అనసూయ బోల్డ్ ఫోటోషూట్ యువతరంలో వైరల్ గా మారింది. డార్క్ గ్రీన్ చుక్కల చొక్కా.. కాంబినేషన్ చెవి జూకాలు.. రంగురంగుల చక్స్ పరికిణీ లో సంథింగ్ స్పెషల్ గా కనిపించింది. అంతేనా.. ఆ నడుము అందాల ఎలివేషన్ తో కవ్విస్తూనే.. కన్ను గీటుతూ రంగమ్మత్త ఇచ్చిన ఫోజు అంతర్జాలంలో కిర్రాక్ పుట్టిస్తోంది. అలా కొంటెగా కన్ను గీటకు రంగమ్మత్తో! అంటూ ఫ్యాన్స్ ఒకటే ఫిదా అయిపోతున్నారు. ప్రస్తుతం సుక్కూ .. బన్నితో భారీ చిత్రానికి సన్నాహాలు చేస్తున్న సంగతి తెలిసిందే. మరోసారి రంగమ్మత్తకు ఈ సినిమాలో ఛాన్సుందని వినిపిస్తోంది. మరిన్ని డిటెయిల్స్ తెలియాల్సి ఉంది.