'ఖిలాడి' అనసూయ నెగటివ్ గేమ్ ఆడనుందా..??

Sun Mar 07 2021 08:00:01 GMT+0530 (IST)

Anasuya Khiladi is doing a negative role in the movie

టాలీవుడ్ బ్యూటిఫుల్ యాంకర్ కం యాక్ట్రెస్ అనసూయ.. పేరు తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. టీవీ యాంకర్ గా కెరీర్ ప్రారంభించిన ఈ భామ.. ప్రస్తుతం యాక్ట్రెస్ గా బిజీ అవుతోంది. అటు టీవీ ప్రోగ్రాంస్ ఇటు సినిమాలను బాలన్స్ చేస్తూ మెయిన్ క్యారెక్టర్స్ చేస్తోంది. ఎలాగో గ్లామర్ కూడా ఉంది.. ఆ ఒక్కటి ఎందుకు దాచేయడం అని స్పెషల్ సాంగ్స్ లోను ఆడిపాడుతోంది. అయితే అనసూయ ప్రస్తుతం చేతినిండా సినిమాలతో బిజీగా ఉంది. అందులో మాస్ రాజా రవితేజ ఖిలాడి సినిమా కూడా ఉంది. ఇప్పుడు ‘ఖిలాడి’ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. యాక్షన్ థ్రిల్లర్‌గా రూపొందుతోన్న ఈ సినిమాలో రవితేజ ద్విపాత్రాభినయం చేస్తున్నాడు.రాక్షసుడు ఫేమ్ రమేష్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో యాక్షన్ కింగ్ అర్జున్ విలన్‌గా నటిస్తున్నాడు. అయితే ఈ సినిమాలో యాంకర్ అనసూయ కీలక పాత్రలో నటిస్తున్న సంగతి తెలిసిందే. గతనెలలో ఆమె షూటింగ్ లో కూడా పాల్గొంది. అప్పుడే అనసూయను ఉద్దేశించి రమేష్ వర్మ ట్వీట్ ద్వారా స్వాగతం పలికిన విషయం విదితమే. 'మేం మరింత స్మార్ట్‌గా ఆడబోతున్నాం. ఎందుకంటే ఈ లేడీ ఒక గేమ్ చేంజర్’ అని చెప్పాడు. అనసూయ పాత్ర ఈ సినిమాలో కీలకమని తెలుస్తుంది. అయితే తాజా సమాచారం ప్రకారం అనసూయ ఖిలాడి సినిమాలో నెగటివ్ రోల్ చేస్తోందని సినీవర్గాల టాక్. అందుకేనేమో.. డైరెక్టర్ ఆమెను గేమ్ చేంజర్ అన్నాడు. కాకపోతే ఎలాంటి గేమ్ ప్లే చేస్తుందో చూడాలి. ఈ సినిమాతో పాటు అనసూయ రంగమార్తాండా పుష్ప సినిమాల్లో కూడా నటిస్తోంది. మే 28న ఖిలాడి విడుదల కాబోతుంది.