Begin typing your search above and press return to search.

న‌ల్ల చీర అత్త‌మ్మ‌కు ఇంట‌ర్నెట్ షేక్

By:  Tupaki Desk   |   22 Feb 2020 12:05 PM GMT
న‌ల్ల చీర అత్త‌మ్మ‌కు ఇంట‌ర్నెట్ షేక్
X
రంగ‌మ్మ‌త్త‌గా సెన్సేష‌న్స్ మ‌ర‌వ‌క ముందే.. ఇంకా ఇంకా సంచ‌ల‌నాల‌కు తెర తీస్తూనే ఉంది అన‌సూయ‌. యాంక‌ర్ గా నెవ్వ‌ర్ బిఫోర్ హాట్ లుక్స్ తో బుల్లితెర వీక్ష‌కుల్ని క‌ట్టి ప‌డేస్తున్న అన‌సూయ మ‌రోవైపు వెండితెరపైనా అదే స్పీడ్ చూపిస్తున్న సంగ‌తి తెలిసిందే. రంగ‌స్థ‌లంలో రంగ‌మ్మ‌త్త పాత్ర‌లో న‌ట‌న‌కు ఉత్త‌మ స‌హాయ‌న‌టిగా ప‌లు అవార్డుల్ని కొల్ల‌గొట్టిన అన‌సూయ ఇప్పుడు బ‌న్ని- సుక్కూ ఏఏ20లోనూ మ‌రోసారి సంచ‌ల‌నాల‌కు తెర తీయ‌బోతోంద‌న్న స‌మాచారం ఉంది. అలాగే ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ల్యాణ్ న‌టిస్తున్న తాజా చిత్రంలోనూ అన‌సూయ ఓ కీల‌క పాత్ర‌లో క‌నిపించ‌నుంది.

ఇటీవ‌ల సోష‌ల్ మీడియాల్లో అనసూయ ఫోటోషూట్లు ఏ రేంజులో వైర‌ల్ అవుతున్నాయో చూస్తున్న‌దే. నిరంత‌రం ఏదో ఒక హాట్ ఫోటోతో గుబులు రేపుతూనే ఉంది అన‌సూయ‌. తాజాగా నెవ్వ‌ర్ బిఫోర్ అనద‌గ్గ ఫోటోషూట్ తో అభిమానుల ముందుకు వ‌చ్చింది ఈ హాట్ యాంక‌ర్. న‌ల్ల చీర‌లో దుమ్ము దుమారం అనే చెప్పాలి. బ్లాక్ శారీకి కాంబినేష‌న్ గా ఆ బంగారు వ‌ర్ణం టాప్ ప‌ర్ఫెక్ట్ గా యాప్ట్ అయ్యింది. ఇక ఎంత‌గా ఫోటోషూట్ల‌కు ఫోజులిచ్చినా త‌న ప‌రిధి మేర సాంప్ర‌దాయ క‌ట్టుబొట్టును విడ‌వ‌క‌పోవ‌డం అన‌సూయ ప్ర‌త్యేక‌త‌. అందుకే యువ‌త‌రంలో ప్ర‌త్యేకించి ఫాలోయింగ్ ని తెచ్చుకుంది.

అన్న‌ట్టు జ‌బ‌ర్ధ‌స్త్ కి ఇప్ప‌టికీ అన‌సూయ‌నే ప్ర‌త్యేక ఆక‌ర్ష‌ణ‌. నాగ‌బాబు వెళ్లినా ఆ టీఆర్పీని అలానే కాపాడేందుకు గాయ‌కుడు మ‌నో (నాగూర్ బాబు)తో క‌లిసి త‌న‌వంతు ప్ర‌య‌త్నం చేస్తోంది. బుల్లితెర హోస్ట్ గా త‌న స్థానం ఇప్ప‌ట్లో చెక్కు చెద‌ర‌దు అన‌డంలో సందేహం లేదు. ర‌క‌ర‌కాల కార్య‌క్ర‌మాల‌తో నిరంత‌రం బుల్లితెర అభిమానుల‌కు అన‌సూయ ట్రీట్ కొన‌సాగుతూనే ఉంది.