కార్తి కోసం ముందుకొచ్చిన స్టార్ హీరో!

Mon Jun 27 2022 17:00:01 GMT+0530 (IST)

Anapurna Studios Bags Karthi's Sardar Movie

కోలీవుడ్ స్టార్ కార్తీకి తమిళంతో పాటు తెలుగులోనూ మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ వుంది. అదే తరహాలో మంచి మార్కెట్ కూడా క్రియేట్ అయింది. దీంతో కార్తి నటించిన ప్రతి సినిమాని తమిళంతో పాటు తెలుగులోనూ ఒకేసారి మేకర్స్ విడుదల చేస్తున్నారు. ఇదే తరహాలో కార్తి నటిస్తున్న లేటెస్ట్ మూవీ కూడా తెలుగులో రిలీజ్ కు రెడీ అవుతోంది. ప్రస్తుతం కార్తి బ్యాక్ టు బ్యాక్ మూడు క్రేజీ ప్రాజెక్ట్ లలో నటిస్తున్నాడు. అందులో ఓ మూవీ దీపావళికి రెండు భాషల్లోనూ ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.కార్తి నటిస్తున్న స్పై యాక్షన్ థ్రిల్లర్ 'సర్దార్'. విశాల్ తో 'అభిమన్యుడు' వంటి విభిన్నమైన యాక్షన్ ఎంటర్ టైనర్ ని అందించిన పీఎస్ మిత్రన్ ఈ మూవీకి దర్శకత్వం వహిస్తున్నాడు. ప్రిన్స్ పిక్చర్స్ బ్యానర్ పై ఎస్. లక్ష్మణ్ కుమార్ ఈ మూవీని భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. తమిళంలో ఈ మూవీని రెడ్ జైంట్ పిక్చర్స్ పై హీరో ఉదయనిధి స్టాలిన్ రిలీజ్ చేస్తున్నారు. రాశిఖన్నా హీరోయిన్ గా నటిస్తోంది.ఇతర కీలక పాత్రల్లో బాలీవుడ్ నటుడు చుంకీ పాండే 'జై భీమ్' ఫేమ్ రజీషా విజయన్ నటిస్తున్నారు.

అలనాటి క్రేజీ హీరోయిన్ లైలా ఈ మూవీతో సుధీర్ఘ విరామం తరువాత రీ ఎంట్రీ ఇస్తున్నారు. తెలుగు తమిళ భాషల్లో దీపావళికి అక్టోబర్ 23న విడుదల కానున్న ఈ మూవీ కోసం కింగ్ నాగార్జున ముందు కొచ్చారు. ఈ మూవీని ఉభయ తెలుగు రాష్ట్రాల్లో అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్ పై భారీ స్థాయిలో రిలీజ్ చేయబోతున్నారు. ఈ విషయాన్ని సోమవారం అధికారిక ట్విట్టర్ హ్యాండిల్ ద్వారా అన్నపూర్ణ స్టూడియోస్ వర్గాలు వెల్లడించాయి.

కార్తి ఖైదీగా పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా రెండు భిన్నమైన పాత్రల్లో ద్విపాత్రాభినయం చేస్తున్నారంటూ వార్తలు వినిపిస్తున్నాయి. ఓ పాత్రలో పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా కనిపించనుండగా మరో పాత్రలో ఖైదీగా 70 ఏళ్ల వ్యక్తిగా కనిపించబోతున్నారు.

ఈ రెండు పాత్రల మేకోవర్ కోసం కార్తి చాలా శ్రమించినట్టుగా తెలుస్తోంది. ఇప్పటికే బయటికి వచ్చిన ఫొటోలు సినిమాపై అంచనాల్ని పెంచేస్తున్నాయి. విశాల్ తో దర్శకుడు పీఎస్ మిత్రన్ చేసిన సినిమా మంచి విజయాన్ని సాధించి డిజిటల్ రంగం చుట్టూ జరుగుతున్న అవకతవకలపై ఆవగాహన కల్పించింది.

ప్రస్తుతం ఇదే దర్శకుడు కార్తితో డిఫరెంట్ కథతో 'సర్దార్' పేరుతో కొత్త సినిమా చేస్తుండటంతో దీనిపై అంచనాలు భారీగానే వున్నాయి. జీవి ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తున్న ఈ మూవీకి జార్జ్ సి. విలియమ్స్ ఛాయాగ్రహణం రూబెన్ ఎడిటింగ్ అందిస్తున్నారు.