Begin typing your search above and press return to search.

విదేశీ ప్రియుడితో లైగ‌ర్ బ్యూటీ క‌జిన్ ప‌రిణ‌యం

By:  Tupaki Desk   |   31 March 2023 9:19 AM GMT
విదేశీ ప్రియుడితో లైగ‌ర్ బ్యూటీ క‌జిన్ ప‌రిణ‌యం
X
త‌న‌దైన అందం ప్ర‌తిభ‌తో అతి త‌క్కువ‌ కాలంలోనే క్రేజీ హీరోయిన్ గా వెలిగిపోతోంది అన‌న్య పాండే. బాలీవుడ్ వెట‌ర‌న్ న‌టుడు చంకీ పాండే కుమార్తెగా అన‌న్య సుప‌రిచితం. ఈ స‌న్న‌జాజి సోయ‌గాన్ని స్టూడెంట్ ఆఫ్ ది ఇయ‌ర్ 2 (2019) చిత్రంతో క‌ర‌ణ్ జోహార్ ప‌రిచ‌యం చేయ‌గా.. తొలి సినిమాతోనే యువ‌త‌రం మ‌న‌సులు గెలుచుకుంది. ఆ త‌ర్వాత బాలీవుడ్ లో ప‌లు విజ‌య‌వంత‌మైన చిత్రాల‌తో క్రేజీ స్టార్ గా మారింది. అయితే దేవ‌ర‌కొండ స‌ర‌స‌న న‌టించిన పాన్ ఇండియా మూవీ లైగ‌ర్ పై చాలా ఆశ‌లు పెట్టుకున్నా అది ఆశించిన విధంగా ప్ర‌జ‌ల‌కు రీచ్ కాక‌పోవ‌డం నిరాశ‌ప‌రిచింది. ఈ చిత్రానికి పూరి జ‌గ‌న్నాథ్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన సంగ‌తి తెలిసిందే.

ప్ర‌స్తుతం అన‌న్య కెరీర్ ప‌రంగా పూర్తి బిజీగా ఉంది. మ‌రోవైపు తీరిక స‌మ‌యాల్లో వెకేష‌న్లు ఫోటోషూట్ల‌తో అల‌రిస్తూనే.. క‌జిన్ వివాహ వేడుక‌ల్ని ఆస్వాధించింది. తాజా స‌మాచారం మేర‌కు అన‌న్య పాండే క‌జిన్ సోష‌ల్ మీడియా ఇన్ ఫ్లూయెన్స‌ర్ అలనా పాండే త‌న విదేశీ ప్రియుడిని వివాహ‌మాడారు. చంకీ పాండేకు అలన్నా పాండే మేనకోడలు. ఈ పెళ్లి సంద‌ర్భంగా చంకీ మాట్లాడుతూ..నా కుమార్తె పెళ్లి చేసుకుంటుందని నేను భావించానని ఎమోష‌న‌ల్ అయ్యారు.

క‌జిన్ డీన్నే పాండే కుమార్తె అలన్నా పాండే ఇటీవలే విదేశీ బోయ్ ఫ్రెండ్ ఐవోర్ మెక్ క్రే ను పెళ్లాడారు. వివాహ వేడుకల నుండి కొన్ని బ‌హిర్గ‌తం కాని కొత్త‌ ఫోటోలను తాజాగా షేర్ చేయ‌గా అవి వైర‌ల్ అయ్యాయి. ఇటీవల సోషల్ మీడియాలో డీన్నే- రేఖ- షారుఖ్ ఖాన్ - గౌరీ ఖాన్ లతో కూడిన ఫోటోలను పోస్ట్ చేయ‌గా వైర‌ల్ అయింది. ఈ సెల‌బ్రిటీ పెళ్లిలో టాప్ సెల‌బ్రిటీలు సంద‌డి చేసారు.

చంకీ పాండే మాట్లాడుతూ .. షాదీ పూర్తయింది. డీన్ బావ మొత్తం పెళ్లి ప‌నులు సాఫీగా సాగిపోయేలా చూసుకున్నాడు. ఒంటి చేత్తో ప్రతిదీ చేశాడు. త‌న‌కు వందకు వంద‌ మార్కులు వేస్తున్నాను. ఇది చాలా కూల్ పార్టీ.. అంటూ ప్ర‌శంసించాడు. నిజంగా చెప్పాలంటే నా కుమార్తెకు వివాహం జరిగినట్లు నేను భావించాను. చికీ (చికీ చుంకీ సోదరుడు డీన్ భార్య‌) ఫ్యామిలీ మాకు చాలా సన్నిహిత కుటుంబం.. ఇది నాకు చాలా ఉద్విగ్న‌ క్షణం'' అని ఎమోష‌న‌ల్ అయ్యారు.

విదేశీ ఫోటోగ్రాఫర్ ఐవోర్ తో తాను ప్రేమలో ఉన్నానని అలన్నా కొన్నేళ్ల క్రిత‌మే ప్రపంచానికి తెలియజేసింది. చాలా కాలంగా ఈ జంట స‌హ‌జీవ‌నంలో ఉన్నారు. ఇప్పుడు పెళ్లి బంధంతో ఒక‌ట‌య్యారు. ప్రేమికుడు ఐవోర్ తో రొమాంటిక్ ఫోటోలు వీడియోల‌ను అల‌నా నిరంత‌రం తన ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేయ‌గా అవి వైర‌ల్ అయ్యాయి. ఇప్పుడు పెళ్లి అనంత‌రం అల‌న్నా ఎమోష‌న‌ల్ నోట్ రాసారు.

ఈ నోట్ సారాంశం ఇలా ఉంది. ''చాలా కాలం క్రితం నేను నిన్ను కలిసే వరకు మరొక మనిషిని ఇంతగా ప్రేమించడం సాధ్యమని గ్రహించలేదు. ప్రతిరోజూ నన్ను నవ్వించినందుకు.. బేషరతుగా నన్ను ప్రేమిస్తున్నందుకు ధన్యవాదాలు. మీరు నిజంగా నన్ను ఈ గ్రహం మీద సంతోషకరమైన మనిషిని చేసారు. ఐవోర్.. నేను మీతో కుటుంబ జీవితాన్ని ఆస్వాధించేందుకు వేచి ఉండలేను!'' అని ఎమోష‌న‌ల్ నోట్ రాసారు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.