అన్నయ్య కంటే ముందే చిన్న దేవరకొండ పెళ్లి!

Sun Oct 24 2021 20:00:01 GMT+0530 (IST)

Anand will get married before Vijay Deverakonda

విజయ్ దేవరకొండ కంటే ముందుగానే ఆనంద్ దేవరకొండ పెళ్లి అయిపోతుందని విజయ్ ఓ ఇంటర్వ్యూలో సరదగా అనేసాడు. ఇప్పుడు ఈ మాట నిజం కాబోతుందా? అంటే అవుననే తెలుస్తోంది. విజయ్ మరోసారి అదే మాటను నొక్కి ఒక్కాణించాడు. ఆనంద్ దేవరకొండ నటించిన `పుష్పకవిమానం` నవంబర్ 12న రిలీజ్ అవుతోన్న సంగతి తెలిసిందే. ఈసందర్భంగా అన్నద మ్ములిద్దరూ  ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. దానికి సంబంధించిన ఓ ప్రమో నెట్టింట వైరల్ గా మారింది. అందులో ఓ సందర్భంలో తమ్ముడి పెళ్లే ముందు అవుతుందని చెప్పాడు రౌడీస్టార్.మరి విజయ్ పదే పదే ఆ మాట ఎందుకంటున్నాడు?  విజయ్ పెళ్లి ఆలస్యంగా చేసుకోవాలనుకుని ఈ మాట అన్నాడా?  లేక పెళ్లి వద్దునుకుని ఇలా తప్పించుకోవడానికి అన్నాడా? అన్నది క్లారిటీ రావాలంటే మొత్తం ఇంటర్య్వూ బయటకు వస్తే గానీ  క్లారిటీ రాదు. ప్రస్తుతం విజయ్ సినిమా కెరీర్ గురించి చెప్పాల్సిన పనిలేదు. నటుడిగా చాలా బిజీగా ఉన్నాడు. `లైగర్` చిత్రంతో బాలీవుడ్ లోనూ లాంచ్ అవుతున్నాడు. ఈ సినిమా పాన్ ఇండియా లో రిలీజ్ అవుతుంది. సక్సెస్ అయితే గనుక విజయ్ క్రేజ్ పాన్ ఇండియాకి చేరుతుంది. ఆ తర్వాత అతని స్టార్ డమ్ నాలింగింతలు రెట్టింపు అవుతుంది.

ఇలా కెరీర్ ని బిల్డ్ చేసుకుని ముందుకు  వెళ్లే అవకాశం ఉంది కాబట్టి ఇప్పట్లో పెళ్లి వద్దనుకుంటున్నాడా? అన్నది తేలాలి. ఇంకా సినిమా రంగంలో ఆయన సాధించాల్సింది చాలానే ఉందని గుసగుసలు వినిపిస్తున్నాయి. అందుకే విజయ్  ముందుగానే తమ్ముడ్ని ఓ ఇంటివాడ్ని చేసేస్తున్నాడా? అన్న సందేహాలు బలపడుతున్నాయి. ఇవన్నీ గాక ఆనంద్ కి దగ్గర సంబంధం ఏదైనా ఉందా? అన్న కోణంలో విజయ్ అలా వ్యాఖ్యానించాడా?  అన్న దాని గురించి థింక్ చేయాల్సిన అవసరం లేకపోలేదు సుమీ. ఇప్పటివరకూ అన్నదమ్ములిద్దరు కేవలం నటనపైనే దృష్టి పెట్టి ముందుకు వెళ్తున్నారు.  ప్రేమ..డేటింగ్ అంటూ ఇద్దరిపై ఎలాంటి రూమర్లు కూడా రాలేదు. మరి భవిష్యత్ లో వాటికేమైనా ఆస్కారం ఉందేమో చూడాలి.