Begin typing your search above and press return to search.

మెగా డాటర్ 'ఓయ్' డైరెక్టర్ తో వెబ్‌ సిరీస్‌ ప్లాన్ చేస్తోందా...?

By:  Tupaki Desk   |   10 July 2020 3:30 AM GMT
మెగా డాటర్ ఓయ్ డైరెక్టర్ తో వెబ్‌ సిరీస్‌ ప్లాన్ చేస్తోందా...?
X
మెగాస్టార్‌ చిరంజీవి పెద్ద కుమార్తె సుష్మిత తన భర్త విష్ణు తో కలిసి గోల్డ్‌ బాక్స్‌ ఎంటర్టైన్మెంట్స్ పేరిట నిర్మాణ సంస్థను ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఇప్పటికే సుష్మిత ఫ్యాషన్‌ డిజైనర్‌ గానే కాకుండా తన తండ్రి చిరంజీవి కి కాస్ట్యూమ్‌ డిజైనర్‌ గా వ్యవహరిస్తూ మంచి మార్కులు కొట్టేసింది. ఇటీవల పూజా కార్యక్రమాల తో మెగాస్టార్‌ సతీమణి సురేఖ చేతుల మీదుగా ప్రారంభించారు. కాగా మొదట గా ఓ వెబ్‌ సిరీస్‌ ద్వారా ఈ ప్రొడక్షన్ హౌస్ డిజిటల్‌ ప్రపంచంలోకి అడుగు పెడుతోంది. ప్రస్తుతం వెబ్ సిరీస్ లకు ఆదరణ పెరుగుతున్న నేపథ్యం లో సుష్మిత ఈ రంగంలో సక్సెస్ అవుతుందని మెగా అభిమానులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఇక ఈ వెబ్ సిరీస్ కి ఆనంద్ రంగా దర్శకత్వం వహించబోతున్నారని సమాచారం. ఆనంద్ రంగా ఇంతక ముందు 'బొమ్మరిల్లు' సిద్దార్థ్ తో ''ఓయ్'' అనే సినిమా రూపొందించిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత పలు సినిమాలకి స్క్రీన్ ప్లే రైటర్ గా సాంగ్స్ డైరెక్టర్ గా వ్యవహరించినప్పటికీ మరో సినిమాకి డైరెక్షన్ మాత్రం చేయలేదు. ఈ క్రమంలో సుష్మిత ప్రొడక్షన్ లో వెబ్ సిరీస్ కి డైరెక్షన్ చేయబోతున్నాడట.

ఇదిలా ఉండగా ఈ వెబ్ సిరీస్ కి 'ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్' అనే టైటిల్ అనుకుంటున్నారట. క్రైమ్ అండ్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ వెబ్ సిరీస్ లో విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్ లీడ్ రోల్ లో నటించబోతున్నాడట. అంతే కాకుండా మరో ప్రధాన పాత్రలో యాక్టర్ సంపత్ రాజ్ కనిపించబోతున్నారట. వీరిద్దరూ ఈ సినిమాలో పోలీసులుగా నటించబోతున్నారట. ఇక ఈ వెబ్ సిరీస్ ప్రముఖ డిజిటల్ ఫ్లాట్ ఫార్మ్ జీ 5 లో స్ట్రీమింగ్ కానుందట. ఇప్పటికే దీనికి సంభందించి ఓటీటీ తో చర్చలు కూడా జరిపారట. ప్రస్తుత పరిస్థితులు కంట్రోల్ లోకి వచ్చిన వెంటనే ఈ వెబ్ సిరీస్ షూటింగ్ స్టార్ట్ చేస్తారట. మరి ఈ వార్తల్లో నిజమెంత ఉందో తెలియాలంటే మరి కొన్ని రోజులు ఆగాల్సిందే.