కలర్ ఫోటో రైటర్ తో చిన్న దేవరకొండ

Mon Jan 17 2022 11:50:50 GMT+0530 (IST)

Anand Devarakonda with color photo writer

విజయ్ దేవరకొండ తమ్ముడిగా టాలీవుడ్ కి పరిచయమైన ఆనంద్ దేవరకొండ అన్నయ్య తరహాలో దూసుకుపోవాలని ప్రయత్నాలు చేస్తున్నా ఫలించడం లేదు. ప్రామిసింగ్ నటుడిగా ప్రూవ్ చేసుకున్నా టైమ్ కలిసి రావడంలో లేదు. గతేడాది `పుష్పక విమానం` చిత్రంతో ప్రేక్షకుల ముందుకొచ్చాడు. ఈ సినిమాని విజయ్ దేవరకొండ నెత్తిన వేసుకుని మరీ ప్రమోట్ చేసాడు. తానే కాకుండా పెద్ద పెద్ద స్టార్లతోనే సినిమాని ప్రమోట్ చేయించాడు. కానీ లాభం లేకపోయింది. తాజాగా ఓ కొత్త ర ఐటర్ తో సినిమా చేయడానికి ఆనంద్ రెడీ అయినట్లు తెలుస్తోంది. `కలర్ ఫోటో` చిత్రానికి రైటర్ గా పనిచేసిన సాయి రాజేశ్ ఆనంద్ తో ఆనంద్ ఓ సినిమాకి అగ్రిమెంట్ చేసుకున్నట్లు సమాచారం.ఇది న్యూ ఏజ్  ట్రయాంగిల్ లవ్ స్టోరీ. ఈ చిత్రాన్ని ఎస్. కె.ఎన్ నిర్మిస్తున్నారుట. మొత్తానికి మరోసారి ఆనంద్ అదృషం్టాన్ని పరీక్షించుకోవడానికి  రెడీ అవుతున్నాడు. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో సక్సెస్ అత్యంత అనివార్యమైన సమయం ఇది. ఇక కలర్ ఫోటోకి రైటర్ గా పనిచేసిన సాయిరాజేశ్ కి ఆ సినిమా కమర్శియల్ గా ఆశించిన సక్సెస్ తీసుకురాలేదు. అంతా కొత్త టీమ్ కావడం...చిన్న పాటి వైఫల్యాలు కనిపించాయి. న్యూ ఏజ్ లవ్ స్టోరీలు టాలీవుడ్ కి కొత్తేం కాదు. మరి ఈ ట్రయాంగిల్ లవ్ స్టోరీ లో యూనిక్ పాయింట్ ఏముంటుందన్ని చూడాలి.

ఇక యువ నిర్మాత ఎస్. కె.ఎన్ కొన్ని సినిమాలకు  సహ నిర్మాతగాను వ్యవహరించారు. కంటెంట్ పట్ల మంచి అవగాహన ఉంది. నిర్మాత వెనుక మారుతి లాంటి డైరెక్టర్ ఉన్నారు కాబట్టి కంటెంట్ పై తగు జాగ్రత్తలు తీసుకునే ఛాన్సెస్ ఉన్నాయి. బ్యాకెండ్ లో మారుతి సూచనలు..సలహాలు కూడా ఉండే ఛాన్సెస్ ఉంది.  అయితే స్ర్కిప్ట్ ఎంపికల్లో ఆనంద్ మొదటి నుంచి పూర్ గానే  ఉన్నాడనే విమర్శ ఉంది. మరి ఈ సినిమాతో ఆ విమర్శని తొలగించుకుంటాడేమో చూడాలి.