Begin typing your search above and press return to search.

జాబిల్లిపై యాత్రకు భారతీయ నటుడికి ఛాన్స్.. తానెవరంటే?

By:  Tupaki Desk   |   9 Dec 2022 2:30 PM GMT
జాబిల్లిపై యాత్రకు భారతీయ నటుడికి ఛాన్స్.. తానెవరంటే?
X
'స్పెస్ ఎక్స్' వచ్చే ఏడాదిలో చంద్రుడి పైకి మానవ సహిత యాత్ర చేపట్టనుంది. ఈ యాత్రను జపాన్ బిలియనీర్ యుసాకు మేజావా ఇప్పటికే రిజర్వు చేసుకున్నాడు. ఈ క్రమంలోనే తనపాటు జాబిల్లి పైకి వెళ్లే క్రూను తాజాగా ప్రకటించారు. ఈ జాబితాలో భారతీయ నటుడికి చోటు దక్కడంపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది.

యసాకు గతేడాది కాలంగా తనతోపాటు స్పేస్ ఎక్స్ లో ప్రయాణించే వారిని ప్రపంచవ్యాప్తంగా ఎంపిక చేస్తున్నాడు. ప్రపంచవ్యాప్తంగా సృజనత్మకత ఉన్న వ్యక్తులకు తనతో పాటుగా స్పేస్ ఎక్స్ యాత్రలో భాగం చేస్తుండటం విశేషం. ఇక ఈ జాబితాలో భారతీయ నటుడు 'బాల్ వీర్ ' ఫేమ్ నటుడు దేవ్ జోషికి చోటు దక్కింది.

ప్రైవేట్ స్పేస్ ఎక్స్ ఫైట్లో యాసాకుతో ప్రయాణించే క్రూను పరిశీలిస్తే.. ఇందులో అమెరికన్ డీజే స్టీవ్ అయెకి.. కొరియన్ స్టార్ టీవోపీ (చోంగ్ సెయింగ్ హ్యూన్).. అమెరికాకు చెందిన దర్శకుడు బ్రెండన్ హాల్.. చెక్ రిపబ్లికన్ కు చెందిన డాన్సర్.. స్నోబోర్డర్ కు చెందిన కైట్లిన్.. కొరియాగ్రాఫర్ యేమీ ఎ.డి.. ఐర్లాండ్ కు చెందినన రియాన్నోస్ ఆడమ్.. అమెరికా యూట్యూబర్ టిమ్ డోడ్డ్.. యూకేకు చెందిన ఫోటోగ్రాఫర్ కరీమ్ ల్లియ.. జపాన్ డాన్సర్ మియూ ఉన్నారు.

1972 అమెరికా చంద్రుడిపైకి మానవ సహిత యాత్ర చేపట్టింది. నీల్ ఆర్మ్ స్ట్రాంగ్ చంద్రుడి పైకి కాలు మోపిన తొలి మానవుడిగా చరిత్ర సృష్టించారు. ఆ తర్వాత మరే దేశం కూడా చంద్రుడి పైకి మానవ సహిత యాత్ర చేపట్టలేదు. ఈ నేపథ్యంలోనే స్పేస్ ఎక్స్ ప్రైవేట్ ప్లయిట్ జాబిల్లి యాత్రను వచ్చే ఏడాదిలో శ్రీకారం చుట్టబోతుంది. ఈ యాత్ర సుమారు 8 రోజుల పాటు సాగనుందని సమాచారం.

వాస్తవానికి ఈ అంతరిక్ష యాత్రకు సంబంధించిన ఏర్పాట్లన్నీ గతేడాది మేలోనే పూర్తయ్యాయి. అయితే భూభ్రమణ పరీక్షకు సంబంధించిన అనుమతులు మాత్రం వీరికి రాలేదని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఈ ప్రయోగం టెక్సాన్ లో నిలిచిపోయింది. కాగా యూసాకు మేజావా తనతోపాటు జాబిల్లి యాత్ర కోసం గతేడాది ట్విట్టర్ వేదికగా క్రూ సభ్యులను ఎంచుకోవడం మొదలుపెట్టారు.

ఈ యాత్ర కోసం ఇప్పటి దాకా 10 లక్షల మంది దరఖాస్తు చేసుకోగా యూసాకు తన బృందంలోని సభ్యులను తాజాగా ప్రకటించారు. ఈ జాబితాలో భారతీయ నటుడు దేవ్ జోషి తాజాగా చోటు సంపాదించుకున్నాడు. అయితే యూసాకు పేర్కొన్న జాబితాలోని వారంతా కూడా క్రీడాకారులు.. కళాకారులే కావడం గమనార్హం.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.