ఫోటో స్టోరి: ఎలక్రిక్ షాక్ తిన్నట్టుందే!

Mon Mar 25 2019 08:00:01 GMT+0530 (IST)

Amy Jackson Glamour Pose

లేడీ రోబోట్ ఎమీజాక్సన్ ప్రస్తుతం ఏం చేస్తోంది?  సినిమాలకు ఎందుకు దూరమైంది? అంటే రకరకాల జవాబులు వినిపిస్తున్నాయి.  2.0 తర్వాత ఈ అమ్మడు వేరొక సినిమాలో నటిస్తున్నది లేదు. అటు బాలీవుడ్ లో కానీ ఇటు సౌత్ ఇండస్ట్రీస్ లో కానీ వేరొక సినిమాకి సంతకం చేయలేదు అమ్మడు. అయితే లండన్ ప్రియుడు జార్జి పనాయట్టుతో జోరుగా ఒంటరి దీవులకు షికార్లు చేస్తోంది. మరోవైపు సామాజిక మాధ్యమాల్లో ఎప్పటికప్పుడు లేటెస్ట్ ఫోటోషూట్లతో విరుచుకుపడుతోంది. ఇందులో జార్జితో రొమాంటిక్ లైఫ్ ని తెర నిండుగానే ప్రదర్శిస్తోంది.అంతేకాదు వీలున్నప్పుడల్లా ఫ్రెండ్స్ తో కలిసి జోరుగా షికార్లు చేస్తూ పార్టీలు చేసుకుంటూ బిజీగా గడిపేస్తోంది. వృత్తిగత జీవితానికి కాస్తంత దూరంగా ఉంటూ... వ్యక్తిగత జీవితాన్ని ఎంజాయ్ చేయడమే ధ్యేయంగా ఈ అమ్మడు ప్లాన్ చేసిందని అర్థమవుతోంది. అయితే మధ్యలో మోడలింగ్ అసైన్ మెంట్స్ వాణిజ్య ప్రకటనలు మాత్రం తన పర్సనల్ లైఫ్ కి కాస్తంత డిస్ట్రబెన్స్. ఇదివరకూ ఓ ఫోటోని షేర్ చేసి నిశ్చితార్థం అయిపోయింది అన్న సిగ్నల్ ఇచ్చింది. దాంతో ఈ ఏడాది పెళ్లి ఖాయమనే భావించారంతా. కట్ చేస్తే.. ఎమీజాక్సన్ వైపు నుంచి కానీ జార్జి నుంచి కానీ దానిపై ఎలాంటి సమాచారం లేదు.  

ఇదిగో లేటెస్టుగా ఎమీ ఇచ్చిన ఫోజు కుర్రకారు గుండెల్లోకి దూసుకుపోయింది. టాప్ టు బాటమ్ ఆ డిజైనర్ లుక్ ఫెంటాస్టిక్. పింక్ కలర్ టాప్.. కాంబినేషన్ గా వయెలెట్ కలర్ బాటమ్ ట్రాక్ ఆకట్టుకున్నాయి. అలాగే వాటికి కాంబినేషన్ కలర్స్ తో ఆ బ్యాగ్ ఎమీ ఫ్యాషన్ ని పీక్స్ కి తీసుకెళ్లింది. స్ప్రింగ్ కలెక్షన్స్ పేరుతో కార్పొరెట్ కంపెనీల ప్రచారం ఇలా కొత్త దారిలో వెళుతోంది అనుకోవచ్చు.